CBSE class 12 results 2023 : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల..-cbse class 12 results declared 87 33 per cent students pass board exams ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Class 12 Results 2023 : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల..

CBSE class 12 results 2023 : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల..

Sharath Chitturi HT Telugu
May 12, 2023 11:13 AM IST

CBSE class 12 results declared : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాల్ని ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల..
సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల..

CBSE class 12 results 2023 declared : క్లాస్​ 12 బోర్డు పరీక్షల ఫలితాలను శుక్రవారం ప్రకటించింది సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్​). మొత్తం మీద 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేసింది. కొవిడ్​ ముందు దశ (2019- 83.40శాతం)తో పోల్చుకుంటే.. ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించింది.

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు..

అభ్యర్థులు తమ ఫలితాలను results.cbse.nic.in, cbseresults.nic.in వెబ్​సైట్స్​లో చెక్​ చేసుకోవచ్చు. డిజీలాకర్​, ఉమంగ్​ యాప్​ల ద్వారా కూడా రిజల్ట్స్​ను పొందవచ్చు.

CBSE class 12 results 2023 live : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాల డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కాంపిటీషన్​ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈసారి కీలక చర్యలు చేపట్టింది సీబీఎస్​ఈ. ఇందులో భాగంగా.. ఫస్డ్​, సెకెండ్​, థర్డ్​ డివిజన్​లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అయితే.. టాపర్స్​కు మెరిట్​ సర్టిఫికేట్​ను ఇవ్వనున్నట్టు పేర్కొంది.

కేరళలోని తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని ప్రయాగ్​ రాజ్​లో కనిష్ఠంగా 78.05శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- పైన చెప్పిన వెబ్​సైట్​/ డైరక్ట్​ లింక్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- విద్యార్థుల రోల్​ నెంబర్​, అడ్మిట్​ కార్డు ఐడీ, స్కూల్​ నెంబర్​ వంటి వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

CBSE class 12 results 2023 date : స్టెప్​ 3:- వివరాలు సమర్పించిన తర్వాత సబ్మీట్​ బటన్​ ప్రెస్​ చేయాలి. స్క్రీన్​పై రిజల్ట్స్​ కనిపిస్తాయి.

స్టెప్​ 4:- రిజల్ట్స్​ను డౌన్​లోడ్​ చేసి పెట్టుకోండి.

సీబీఎస్​ఈ క్లాస్​ 10..

How to check CBSE class 12 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15- మార్చ్​ 21 మధ్యలో ఈ పరీక్షలు జరిగాయి. ఇక క్లాస్​ 12 పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్​ 5 వరకు నిర్వహించింది సీబీఎస్​ఈ. జనవరి 2 నుంచి 14 మధ్యలో ఈ రెండు క్లాస్​లకు ప్రాక్టికల్​ పరీక్షలు సైతం జరిగాయి.

Whats_app_banner

సంబంధిత కథనం