CBSE 10th Results: సీబీఎస్ఈ 10వ తరగతిలో 93% ఉత్తీర్ణత
CBSE 10th Results: సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 21 వరకు జరగిన ఈ పరీక్షల్లో 93.12% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను cbseresults.nic.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
CBSE 10th Results: 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ పరీక్ష ఫలితాలను సీబీఎస్ఈ (CBSE) శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbse.gov.in లో, లేదా resresults.nic.in తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
CBSE 10th Results: 93% ఉత్తీర్ణత
2023 వ సంవత్సరానికి గానూ సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 93.12% ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 21,658,05 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, 20, 167,79 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 14న ప్రారంభమయ్యాయి. మార్చి 21న 10వ తరగతి పరీక్షలు, ఏప్రిల్ 5వ తేదీన 12వ తరగతి పరీక్షలు ముగిశాయి. మొత్తం, 10 వ తరగతి, 12వ తరగతి కలిపి దేశవ్యాప్తంగా మొత్తం సుమారు 38 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. ప్రాంతాల వారీగా తీసుకుంటే 2023లో త్రివేండ్రం రీజియన్ లో విద్యార్థులు అత్యధికంగా 99.91% ఉత్తీర్ణత సాధించారు. ఆ తరువాత స్థానాల్లో 99.18% తో బెంగళూరు, 99.14% తో చెన్నై ఉన్నాయి. అత్యల్ప ఉత్తీర్ణత సాధించిన ప్రాంతంగా అస్సాంలోని గువాహతి రీజియన్ నిలిచింది. ఇక్కడ 76.90% విద్యార్థులు పాస్ అయ్యారు. గువాహతి, ఢిల్లీ ఈస్ట్ మినహాయిస్తే మిగతా అన్నిరీజియన్లు 90% పైగానే ఉత్తీర్ణత సాధించాయి.
2022లో 94.4% ఉత్తీర్ణత
2022 సంవత్సరంలో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు జులై 22 న ప్రకటించారు. ఈ సంవత్సరం దాదాపు రెండు నెలల ముందే ఫలితాలను ప్రకటించారు. 2022 లో మొత్తం 20,93,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 19,76,668 మంది పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ సుమారు 94.4%.
CBSE 10th Results: ఈ వెబ్ సైట్స్ లో ఫలితాలు
ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే,
cbse.gov.in
cbse.nic.in.
results.cbse.nic.in
digilocker.gov.in
results.gov.in.
తదితర వెబ్ సైట్స్ లో కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, డిజిలాకర్ (Digilocker), ఉమంగ్ (UMANG) మొబైల్ యాప్స్ లో కూడా ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
CBSE 10th Results: చెక్ చేసుకోవడం ఎలా?
ముందుగా సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్ష ఫలితాలు అందుబాటులో ఉన్న cbse.gov.in. వంటి ఏదైనా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
హోం పేజీపై కనిపించే CBSE Board Class 10th Result 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
అవసరమైన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ నొక్కాలి.
పరీక్ష ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
రిజల్ట్ చెక్ చేసుకుని, పేజ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
రిజల్ట్ పేజ్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
ఈ సంవత్సరం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 21 వరకు జరిగాయి.