CBSE class 12 results 2023 : సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదల..
12 May 2023, 11:13 IST
- CBSE class 12 results declared : సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదల..
CBSE class 12 results 2023 declared : క్లాస్ 12 బోర్డు పరీక్షల ఫలితాలను శుక్రవారం ప్రకటించింది సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్). మొత్తం మీద 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేసింది. కొవిడ్ ముందు దశ (2019- 83.40శాతం)తో పోల్చుకుంటే.. ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించింది.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు..
అభ్యర్థులు తమ ఫలితాలను results.cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. డిజీలాకర్, ఉమంగ్ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్‌ను పొందవచ్చు.
CBSE class 12 results 2023 live : సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాల డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాంపిటీషన్ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈసారి కీలక చర్యలు చేపట్టింది సీబీఎస్ఈ. ఇందులో భాగంగా.. ఫస్డ్, సెకెండ్, థర్డ్ డివిజన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అయితే.. టాపర్స్‌కు మెరిట్ సర్టిఫికేట్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది.
కేరళలోని తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కనిష్ఠంగా 78.05శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- పైన చెప్పిన వెబ్సైట్/ డైరక్ట్ లింక్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2:- విద్యార్థుల రోల్ నెంబర్, అడ్మిట్ కార్డు ఐడీ, స్కూల్ నెంబర్ వంటి వివరాలు చెప్పాల్సి ఉంటుంది.
CBSE class 12 results 2023 date : స్టెప్ 3:- వివరాలు సమర్పించిన తర్వాత సబ్మీట్ బటన్ ప్రెస్ చేయాలి. స్క్రీన్‌పై రిజల్ట్స్ కనిపిస్తాయి.
స్టెప్ 4:- రిజల్ట్స్‌ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.
సీబీఎస్ఈ క్లాస్ 10..
How to check CBSE class 12 results : సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15- మార్చ్ 21 మధ్యలో ఈ పరీక్షలు జరిగాయి. ఇక క్లాస్ 12 పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించింది సీబీఎస్ఈ. జనవరి 2 నుంచి 14 మధ్యలో ఈ రెండు క్లాస్‌లకు ప్రాక్టికల్ పరీక్షలు సైతం జరిగాయి.