తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Bridge Collapse: బిహార్ లో అంతే.. నెల వ్యవధిలో కుప్పకూలిన 15 వంతెనలు.. అందులో ఒకటి మూడోసారి కూలిపోయింది..

Bihar bridge collapse: బిహార్ లో అంతే.. నెల వ్యవధిలో కుప్పకూలిన 15 వంతెనలు.. అందులో ఒకటి మూడోసారి కూలిపోయింది..

HT Telugu Desk HT Telugu

17 August 2024, 18:48 IST

google News
  • Bihar bridge collapse: బిహార్ లోని గంగా నదిపై నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాన్ గంజ్ వంతెన మరోసారి కుప్పకూలింది. ఈ వంతెన ఇప్పటికే రెండు సార్లు పాక్షికంగా కూలిపోయింది. నిర్మాణంలో ఉండగానే, ఈ వంతెన కూలిపోవడం ఇది ముచ్చటగా మూడోసారి. ముచ్చటగా మూడోసారి కుప్పకూలిన వంతెన

బిహార్ లో నెల వ్యవధిలో కుప్పకూలిన 15 వంతెనలు
బిహార్ లో నెల వ్యవధిలో కుప్పకూలిన 15 వంతెనలు

బిహార్ లో నెల వ్యవధిలో కుప్పకూలిన 15 వంతెనలు

Bihar bridge collapse: గంగా నదిపై బిహార్ లో నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాన్ గంజ్ వంతెనలో కొంత భాగం 2023 జూన్ 5న కూలిపోయింది. బిహార్ లో ఈ వంతెన కూలిపోవడం ఇది మూడోసారి. 2022 ఏప్రిల్ 29న ఇదే వంతెనపై పిడుగు పడడంతో మొదటిసారి కూలిపోయింది. మొదటి, రెండోసారి వంతెన కూలినప్పుడు విచారణ జరిపిన కమిటీలు సమర్పించిన నివేదికలను విశ్లేషించాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శనివారం అధికారులను కోరారు.

పునర్మిర్మాణంలో ఉండగా..

ఈ వంతెన కూలిపోవడం ఇది మూడోసారి. మొదటిసారి పిడుగు పడి కూలిపోయినప్పుడు, ఆ వంతెనను పూర్తిగా కూల్చివేసి పునర్నిర్మించాలని నిర్ణయించారు. అయితే, రెండో సారి వంతెన కూలినప్పుడు, ఆ బ్రిడ్జిని నిర్మించిన కంపెనీని దోషిగా తేల్చిన కోర్టు.. కంపెనీ తన సొంత ఖర్చుతో వంతెనను పునర్నిర్మించాలని తీర్పునిచ్చింది. ఇప్పుడు నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన మూడోసారి కుప్పకూలింది.

4 వారాల వ్యవధిలో కూలిన 15 వంతెనలు

ఈ వంతెన మొదటి సారి, రెండో సారి కూలినప్పుడు విచారణ జరిపిన కమిటీల నివేదికలను అధ్యయనం చేయాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. ‘‘ఆ కమిటీల నివేదికలను విశ్లేషించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని తేజస్వీ యాదవ్ కోరారు. బిహార్ (bihar) లో నాలుగు వారాల్లో రాష్ట్రంలో 15 వంతెనలు కూలిపోయాయి. వీటిలో అరారియా జిల్లా ఫోర్బ్స్ గంజ్ బ్లాక్ లోని అమ్హరా గ్రామం వద్ద పర్మన్ నదిపై నిర్మించిన వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

సుప్రీంకోర్టు విచారణ

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు వంతెన కూలిన సంఘటనలపై దాఖలైన పిటిషన్ పై స్పందించాలని సుప్రీంకోర్టు జూలై 28 న బిహార్ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలపై ఉన్నతస్థాయి స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని న్యాయవాది బ్రజేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బలహీనమైన నిర్మాణాలను కూల్చివేయడం లేదా మరమ్మతులు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సాధ్యాసాధ్యాల ప్రకారం సమాధానం ఇవ్వాలని బిహార్ ప్రభుత్వం, ఇతర సంబంధిత పక్షాలను ధర్మాసనం ఆదేశించింది.

రెండేళ్లుగా ఇదే పరిస్థితి

అరారియా, సివాన్, మధుబని, కిషన్ గంజ్ సహా పలు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోవడం గత రెండేళ్లలో సర్వసాధారణమైంది. నిర్మాణంలో ఉన్నవే కాకుండా, ఇతర వంతెనలు కూడా కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు, సంబంధిత ఏజెన్సీల అవినీతి నెట్ వర్క్ ఇలాంటి ఘటనలకు కారణమని పిటిషన్ లో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం