Janasena Symbol: ఏపీ హైకోర్టులో జనసేనకు ఊరట..గాజు గ్లాస్ గుర్తు మళ్లీ జనసేనకే… పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
Janasena Symbol: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. పార్టీ గుర్తుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయించింది.
Janasena Symbol: పవన్ కళ్యాణ్ Pawan Kalyan సారథ్యంలోని జనసేన janasena పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించాలన్న ఈసీ నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించవద్దని హైకోర్టు AP High courtలో దాఖలైన పిటిషన్‌పై ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ పిటిషన్‌పై ఇటీవల తీర్పు రిజర్వ్ చేశారు.
జనసేనకు గాజు గ్లాస్ గుర్తుపై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్‍ను హైకోర్టు కొట్టివేసింది.
ఎన్నికల సంఘం జనసేన పార్టీని రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించి గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ ఏప్రిల్ 2వ తేదీన జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తరపున జనసేన అభ్యర్థులు ప్రచారం కూడా చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసును (Janasena) ఫ్రీ సింబల్ గా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీ(EC) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
జనసేన పార్టీకి కేంద్రం ఎన్నికల సంఘం Election Commission గాజు గ్లాసు గుర్తును(Janasena Glass Tumbler) కేటాయించిందని ఆ పార్టీ లీగల్ సెల్ జనవరిలో ప్రకటించింది. ఈసీ జనసేనకు గ్లాస్ గుర్తుని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించారని అప్పట్లో జనసేన(Janasena) ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే తాజాగా ఈసీ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో గందరగోళం నెలకొంది.
ఈ క్రమంలో జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ ప్రేరేపిత చర్యగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రానున్న ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేస్తారని ఆ పార్టీ ముఖ్య నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారని, ఈ సారి కూడా ఎలాంటి గందరగోళం ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీని ఇబ్బంది పెట్టడానికే రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యేలోగా ఈ అంశం కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. పార్టీ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేయడానికే రకరకాల ప్రచారాలు చేస్తున్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నారు.
సంబంధిత కథనం