ED raids Tejashwi Yadav's house: తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ సోదాలు
ED raids Tejashwi Yadav's house: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ (land for jobs) స్కామ్ కు సంబంధించి బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఇంట్లో శుక్రవారం ఈడీ (enforcement directorate ED) సోదాలు నిర్వహించింది.
ED raids Tejashwi Yadav's house: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్న ల్యాండ్ ఫర్ జాబ్స్’ (land for jobs) స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate ED) విచారణను వేగవంతం చేసింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కు చెందిన ఢిల్లీ నివాసంలో శుక్రవారం సోదాలు నిర్వహించింది. అలాగే ఢిల్లీ, బిహార్ ల్లోని మరికొన్ని ప్రదేశాల్లోనూ సోదాలు చేసింది. వాటిలో లాలు ప్రసాద్ యాదవ్ ముగ్గురు కూతుళ్లకు చెందిన నివాసాలు, ఇతర ఆర్జేడీ సీనియర్ నాయకుల నివాసాలు కూడా ఉన్నాయి.
Lalu main accsed in land for jobs scam: లాలు ప్రధాన నిందితుడు
రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇవ్వడానికి అభ్యర్థుల నుంచి అత్యంత చవకగా, అంటే నామమాత్ర ధరలకు భూములను కొనుగోలు చేశారనేది ఈ స్కామ్ లోని నిందితులపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కేసులో లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన భార్య రబ్రీదేవి (Rabri Devi) ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిపై సీబీఐ (CBI) ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ (enforcement directorate ED) కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ స్కామ్ కు సంబంధించి మంగళవారం సీబీఐ లాలు ప్రసాద్ యాదవ్ ను సుమారు 5 గంటల పాటు విచారించింది. సోమవారం రబ్రీదేవిని (Rabri Devi) కూడా సీబీఐ (CBI) ప్రశ్నించింది. ఈ స్కామ్ లో లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందారని సీబీఐ (CBI) ఆరోపిస్తోంది. లాలు ప్రసాద్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు.