HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Paper Leak : నీట్​ పేపర్​ లీక్​ మాస్టర్​మైండ్​ ఇతనే..! పెద్ద గ్యాంగే ఉంది!

NEET Paper Leak : నీట్​ పేపర్​ లీక్​ మాస్టర్​మైండ్​ ఇతనే..! పెద్ద గ్యాంగే ఉంది!

Sharath Chitturi HT Telugu

25 June 2024, 11:16 IST

    • Sanjeev Mukhiya NEET : బిహార్​కు చెందిన సంజీవ్​ ముఖియాను.. నీట్​ పేపర్​ లీక్​ మాస్టర్​మైండ్​గా భావిస్తున్నారు. ఎవరి ఈ సంజీవ్​ ముఖియా?
సంజయ్​ ముఖియా..
సంజయ్​ ముఖియా..

సంజయ్​ ముఖియా..

Sanjeev Mukhiya NEET : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్​ యూజీ 2024 పేపర్​ లీక్​కు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఇక ఇప్పుడు.. వీటన్నింటి మధ్య.. సంజీవ్​ ముఖియా అనే వ్యక్తి పేరు వార్తలకెక్కింది. నీట్​ పేపర్​ లీక్​ మాస్టర్​మైండ్​ ఇతడే అని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఇంతకి ఎవరీ సంజీవ్​ ముఖియా?

ఎవరు ఈ సంజీవ్​ ముఖియా..?

బిహార్​ నలంద జిల్లావాసి ఈ సంజీవ్​ ముఖియా. ఇతనికి సంజీవ్​ సింగ్​ అనే పేరు కూడా ఉంది. అంతేకాదు.. పేపర్​ లీక్​ వ్యవహారంలో ఇతనికి అనుభవం కూడా ఉంది. నలంద కాలేజ్​కు చెందిన నూర్​సరై బ్రాంచ్​లో టెక్నికల్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న సమయంలో.. అనేకమార్లు పేపర్​ లీక్​లకు పాల్పడినట్టు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. 2016లో సంచలనం సృష్టించిన బిహార్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​ పేపర్​ లీక్​లోనూ ఇతని హస్తం ఉంది.

రవి అత్రి అనే వ్యక్తితో కలిసి.. ఈ సంజీవ్​ ముఖియా.. ఒక టీమ్​ని నడిపిస్తుంటాడు. దాని పేరు 'సాల్వర్​ గ్యాంగ్​'! లీకైన క్వశ్చన్​ పేపర్స్​ని ఇవ్వడం లేదా ప్రాక్సీల చేత పరీక్షలు రాయించడం ఈ గ్యాంగ్​ పని. వివిధ రాష్ట్రాల్లో కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ పరీక్షల నుంచి టీచర్​ నియామక పరీక్షల వరకు ఈ గ్యాంగ్​ హస్తం ఉందని పోలీసులు దర్యాప్తులో తేలింది.

Who is Sanjeev Mukhiya : ఇక అధికారుల ప్రకారం.. నీట్​ యూజీ 2024 క్వశ్చన్​ పేపర్​, ఆన్సర్​ షీట్స్​ పంపకాలు ఈ సంజీవ్​ ముఖియా మేనేజ్​ చేశాడు. ఒక ప్రొఫెసర్​ నుంచి వీటిని.. మొబైల్​ ఫోన్స్​ ద్వారా సంజీవ్​ ముఖియా పొందాడు. ఆ ప్రొఫెసర్​ ఎవరు? అనేది ఇంకా తెలియరాలేదు. అతడిని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి:- NEET Row: పేపర్ లీకేజీ కుట్రను ఛేదించిన బీహార్ పోలీసులు

కుమారుడికి కూడా అదే పని..!

ఈ సంజీవ్​ ముఖియా భార్య మమతా దేవీ.. భుతఖర్​ పంచాయత్​ చీఫ్​గా పనిచేస్తున్నారు. లోక్​జన్​శక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఆ స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. ఇక.. వీరి కుమారుడు శివ్​ కుమార్​.. బిహార్​ రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​కు సంబంధించిన పేపర్​ లీక్​ కేసులో లీగల్​ కేసులు ఎదుర్కొంటున్నాడు!

NEET Paper Leak latest updates : అయితే.. సొంత గ్రామంలో సంజీవ్​ ముఖియా కుటుంబానికి మంచి సపోర్ట్​ ఉన్నట్టు కనిపిస్తోంది. సంజీవ్​ ముఖియా.. వ్యవసాయం చేసుకునే సాధారణ వ్యక్తి అని, గ్రామం దాటి, ఇతర వ్యవహారాలపై అతనికి ఎలాంటి ప్రభావం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు.

అయితే.. సంజీవ్​ ముఖియా ప్రస్తుతం ఇండియాలో లేడు! నీట్​ పేపర్​ లీక్​ వివాదం తీవ్రం అవ్వడంతో.. అతను నేపాల్​కి పారిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇండియా నేపాల్​ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల.. నేరస్తుల అప్పగింత ప్రక్రియ ఎంత సులభం కాదని ముఖియాకు తెలుసు!

తదుపరి వ్యాసం