నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కోసం తన బృందాలను పలు రాష్ట్రాలకు పంపింది. కాగా నీట్ పేపర్ లీకేజీ కేసులో బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఐదుగురిని అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.
పలు పోటీ పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయడంపై విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకతవకలను గుర్తించిన తర్వాత బీహార్లోని పరీక్షా కేంద్రాల నుంచి 17 మంది విద్యార్థులను డీబార్ (తొలగింపు) చేసింది. ఈ వివాదం చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 110 మంది విద్యార్థులు ఇలాంటి చర్యలను ఎదుర్కొన్నారు.
(పీటీఐ నుంచి అందిన సమాచారంతో..)