Mangaluru acid attack : షాకింగ్.. ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ దాడి!
04 March 2024, 13:58 IST
- Acid attack on students : మంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె పక్కనే ఉన్న మరో ఇద్దరి విద్యార్థినులపైనా యాసిడ్ పడింది!
షాకింగ్.. ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ దాడి!
Acid thrown on students in Karnataka : కర్ణాటక మంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు విద్యార్థినులపై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు!
ఇదీ జరిగింది..
కర్ణాటక మగళూరులోని కడాబ తాలుకలో ఉన్న ప్రభుత్వ ప్రీ- యూనివర్సిటీ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఉదయం జరిగింది ఈ యాసిడ్ దాడి ఘటన. ముగ్గురు అమ్మాయిలు కాలేజ్ దగ్గర కూర్చిన ఉన్నారు. ఆ ముగ్గురు.. 2వ ఏడాది పీయూ ఫిజిక్స్ ఎగ్జామ్ కోసం చదువుతుండగా.. ఓ వ్యక్తి, అనూహ్యంగా వారిపైకి దూసుకెళ్లాడు. ముగ్గురిలో ఒకరిపై యాసిడ్ పోసేందుకు ప్రయత్నించాడు. మిగిలిన ఇద్దరిపైనా ఆ యాసిడ్ పడింది.
మంగళూరులు యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు విద్యార్థినులను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తొలుత యాసిడ్ పడిన విద్యార్థినికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఆ ముగ్గురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురి ముఖాలకి గాయాలయ్యాయి. అవసరమైతే.. ఆ ముగ్గురిని మంగళూరులోని హాస్పిటల్కి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
Mangaluru acid attack : అదే సమయంలో.. నిందితుడిని పట్టుకున్న ఇతర విద్యార్థులు.. పోలీసులకు అప్పగించారు.
మంగళూరులో యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు అబిన్ అని సమాచారం. అతని వయస్సు 23ఏళ్లు. అతను కేరళ మల్లప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి. నిందితుడు, బాధితుల్లో ఒకరు.. ఒకే కమ్యూనిటీకి చెందిన వారిని తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిందితుడు లవ్ ఫెయిల్ అయ్యాడని, అందుకే యాసిడ్ దాడి చేశాడని తెలుస్తోంది.
ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించిన పోలీసులు.. త్వరలోనే మరిన్న విషయాలను చెబుతాని స్పష్టం చేశారు.
మంగళూరులో ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగిన ఘటనపై విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ స్పందించారు.
Acid attack on Government PU college students : "దక్షిణ కన్నడ జిల్లా కడాబలోని ప్రభుత్వ పీయూ కాలేజ్లో జరిగిన యాసిడ్ దాడి ఘటన బాధాకరం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. ఈ ఘటన చెబుతోంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. గాయపడిన విద్యార్థినులు త్వరగా కోలుకుంటారని ప్రార్థిస్తున్నాను," అని బసనగౌడ అన్నారు.