IndiGo: మంగళూరు నుంచి హైదరాబాద్ కు డైరెక్ట్ ఫ్లైట్-indigo to launch third direct flight from mangaluru to hyderabad from oct 19 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indigo: మంగళూరు నుంచి హైదరాబాద్ కు డైరెక్ట్ ఫ్లైట్

IndiGo: మంగళూరు నుంచి హైదరాబాద్ కు డైరెక్ట్ ఫ్లైట్

HT Telugu Desk HT Telugu
Oct 12, 2023 05:22 PM IST

IndiGo: మంగళూరు నుంచి హైదరాబాద్ కు మూడో డైరెక్ట్ ఫైట్ ను అక్టోబర్ 19వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IndiGo: హైదరాబాద్ నుంచి కర్నాటకలోని మంగళూరుకు తరచూ ప్రయాణం చేసే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మంగళూరు, హైదరాబాద్ ల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ను ఇండిగో విమానయాన సంస్థ ప్రారంభిస్తోంది.

మూడో డైరెక్ట్ ఫ్లైట్

ఇండిగో(IndiGo) ఇప్పటివరకు తమిళనాడులోని సేలం, చెన్నైల మధ్య మొదటి డైరెక్ట్ ఫ్లైట్ (direct flight) ను, బెంగళూరు, హైదరాబాద్ ల మధ్య రెండో డైరెక్ట్ ఫ్లైట్ ను ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా మంగళూరు, హైదరాబాద్ ల మధ్య ప్రారంభిస్తోంది. అక్టోబర్ 19 మధ్యాహ్నం 2.15 గంటలకు మంగళూరు కు చేరుకున్న ఈ విమానం మధ్యాహ్నం 2. 35 గంటలకు మంగళూరు నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన సంస్థ మంగళూరు నుంచి చెన్నైకి, మంగళూరు నుంచి చెన్నైకి, అలాగే మంగళూరు నుంచి హైదరాబాద్ కు 78 సీట్ల ఏటీఆర్ విమానాన్ని నడుపుతోంది.