IndiGo: ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం
IndiGo's tail strike: ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా ధ్వంసమైంది. సిబ్బంది, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా ధ్వంసమైంది. సిబ్బంది, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
IndiGo's tail strike: కోల్ కతా నుంచి వస్తుండగా..
కోల్ కతా నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానం (IndiGo A321-252NX) ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో స్వల్ప ప్రమాదానికి గురైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే 27 పై ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ విమానం వెనుక తోక భాగం రన్ వే పై కొద్ది దూరం నేలకు తగులుతూ రాసుకుపోయింది(tail strike). దాంతో ప్రయాణికులు కాసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా ధ్వంసమైంది. దాంతో, విమానాన్ని ప్రయాణ సేవల నుంచి తాత్కాలికంగా తప్పించారు. విమానంలోని ఆపరేటింగ్ సిబ్బందిని దర్యాప్తు పూర్తయ్యేవరకు, తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కానీ, లేదా టేకాఫ్ అవుతున్న సమయంలో కానీ విమానం తోక భాగం రన్ వే కు బలంగా తగలడాన్ని టెయిల్ స్ట్రైక్ (tail strike) అంటారు. ఇటీవలి కాలంలో ఈ టెయిల్ స్ట్రైక్ ఘటనలు కూడా పెరిగాయి. ఇటీవల నాగపూర్ ఏర్ పోర్ట్ లో కూడా ఒక ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్ గురైంది.