Anasuya Fires on Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అనసూయ షాకింగ్ కామెంట్స్.. ద్వేషిస్తున్నా అంటూ స్పష్టం
Anasuya Fires on Indigo: ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అనసూయ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఈ ఎయిర్‌లైన్స్‌ను ద్వేషిస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.
Anasuya Fires on Indigo: ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఏం కామెంట్ చేసినా అది చర్చనీయాంశమవుతోంది. నెట్టింజ ఆమె పెట్టే పోస్టులు వైరల్ కావడంతో పాటు కొన్నిసార్లు వివాదాలకు కూడా దారితీస్తున్నాయి. గతంలో తనను ఆంటీ అంటున్నారని కొంతమంది నెటిజన్లపై అనసూయ విరుచుకపడటంతో అది పెద్ద వివాదంగా మారింది. తాజాగా అనసూయ తన ట్వీట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండిగో సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
"ఇండిగోను నేను వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నాను. ఈ డొమస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ మనపై ఆధిపత్యం చెలాయించడం బాధాకరం. అస్సలు వీరి సేవల్లో నాణ్యతే ఉండదు." అంటూ అనసూయ తన ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. అయితే తాను ఎందుకు ఇండిగోను వ్యతిరేకిస్తున్నారో మాత్రం అనుసూయ చెప్పలేదు.
అనసూయ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెకు సానుకూలంగా కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇండియాలో ఇంతకంటే బెస్ట్ డొమస్టిక్ ఎయిర్‌లైన్స్ చూపిస్తారా అని అనసూయపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మనదేశంలో ఉత్తమమైన దేశీయ విమానాయన సంస్థ ఇండిగోనే అని తమ స్పందనలను తెలియజేస్తున్నారు. అనసూయ ఏం పోస్టు పెట్టినా ద్వేషించే కొంతమంది మాత్రం.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణిస్తున్నారు. ఆమె కావాలనే ఇలా చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.
ఇండిగోపై సెలబ్రెటీలు అసహనం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే మంచు లక్ష్మీ కూడా ఇండిగో సిబ్బందిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి-హైదరాబాద్ ప్రయాణం చేసిన ఆమె ఇండిగో విమానంలో తన బ్యాగ్ మర్చిపోయి రావడంతో.. సిబ్బందికి తెలియజేశారు. అయితే ఆ బ్యాగ్ కోసం ఆమె గేటు వద్ద 40 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ అక్కడే ఉన్నానని లక్ష్మీ పేర్కొన్నారు. తను ఎదురుచూసి సమయం కంటే తిరుపతి నుంచి హైదరాబాద్ ప్రయణం చేసిన సమయమే తక్కువ అంటూ చురకలు అంటించారు.
టాపిక్