Ari Trailer: అనసూయ ‘అరి' ట్రైలర్ అదుర్స్.. వెరైటీ కాన్సెప్ట్.. ఫ్రెష్ లుక్
Ari Trailer: వెరైటీ కాన్సెప్ట్.. ఫ్రెష్ లుక్ తో అదుర్స్ అనిపించేలా ఉంది అనసూయ నటించిన అరి ట్రైలర్. తమ కోరికలను తీర్చుకోవడానికి మనుషులు ఎంత వరకైనా వెళ్తారనడానికి నిదర్శనంగా ఈ ట్రైలర్ నిలుస్తోంది.
Ari Trailer: నేచునల్ స్టార్ నాని చెప్పినట్లు టాలీవుడ్ అనే కాదు ఇండియన్ సినిమాలో కమర్షియల్, మాస్ మూవీసే రాజ్యమేలుతాయి. కానీ అప్పుడప్పుడూ కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో, ఓ ఫ్రెస్ లుక్ తో వచ్చే సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ కోవలోకి వచ్చే మూవీలాగే కనిపిస్తోంది అరి (Ari). తాజాగా ఆదివారం (మార్చి 12) ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది.
అనసూయ, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్షలాంటి వాళ్లు నటించిన ఈ అరి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. ఎలాంటి కోరికతో వెళ్లినా దానిని తీర్చే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథే ఈ అరి. వాళ్ల ఆ కోరికలు తీరాలంటే కొన్ని వింత పనులు చేయాలని ఆ వ్యక్తి చెప్పడం ట్రైలర్ లో చూడొచ్చు. తమ కోరిక నెరవేరితే చాలు.. ఏం చేయడానికైనా సిద్ధపడే పాత్రల్లో అనసూయ, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు నటించారు.
తన కంటే నేనే చాలా అందంగా ఉండాలి అంటూ అనసూయ ఈ ట్రైలర్ లో చెబుతుంది. ట్రైలర్ చూస్తున్నంతసేపూ ఓ ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించాలని దర్శకుడు జయశంకర్ భావిస్తున్నాడు. పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు.. ఈ సినిమాతో ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ట్రైలర్ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉత్కంఠను పెంచేలా సాగింది. ఈ కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న అరి మూవీని ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి. ఈ సినిమాను అర్వి సినిమాస్ బ్యానర్ లో శ్రీనివాస్ రామి రెడ్డి, శేషు మారమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆర్వీ రెడ్డి సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ సహా ఇతర వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్