తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Acid Attack : దిల్లీలో దారుణం.. కోడలిపై అత్త యాసిడ్​ దాడి!

Acid attack : దిల్లీలో దారుణం.. కోడలిపై అత్త యాసిడ్​ దాడి!

Sharath Chitturi HT Telugu

23 September 2023, 6:18 IST

google News
  • Acid attack in Delhi : కోడలిపై ఓ మహిళ యాసిడ్​తో దాడి చేసిన ఘటన దిల్లీలో కలకలం సృష్టించింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

దిల్లీలో దారుణం.. కోడలిపై అత్త యాసిడ్​ దాడి!
దిల్లీలో దారుణం.. కోడలిపై అత్త యాసిడ్​ దాడి!

దిల్లీలో దారుణం.. కోడలిపై అత్త యాసిడ్​ దాడి!

Delhi acid attack : దేశ రాజధాని దిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలిపై ఓ మహిళ యాసిడ్​ దాడికి పాల్పడింది!

ఇదీ జరిగింది..

దిల్లీ పోలీసుల ప్రకారం.. న్యూ ఉస్మాన్​పూర్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి అత్త అంజలి.. ఆమెపై యాసిడ్​ పోసింది. 25శాతం కాలిన గాయాలతో బాధితురాలు జేపీసీ ఆసుపత్రిలో చేరింది. అక్కడి నుంచి ఆమెను లోక్​ నాయక్​ జై ప్రకాశ్​ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది.

కోడలిపై యాసిడ్​ దాడి ఘటన అనంతరం బాధితురాలి అత్త, ఇతర కుటుంబసభ్యులు పారిపోయారు. కాగా.. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం.. సంత్​ నగర్​ బురారిలో అంజలిని అరెస్ట్​ చేశారు. ఇతర కుటుంబసభ్యులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. మరోవైపు అంజలిపై ఐపీసీ సెక్షన్​ 323, 326ఏ, 34 కింద వివిధ కేసులు నమోదు చేశారు పోలీసులు.

Delhi crime news : ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధితురాలికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు 6 నెలల బిడ్డ కూడా ఉంది. కాగా.. కుటుంబసభ్యులతో, ముఖ్యంగా అత్తతో ఆమెకు ఇబ్బందులు ఉన్నాయి.

"ఉస్మాన్​పూర్​లోని ఓ ఇంట్లో వీరందరు ఉంటున్నారు. కింద ఫ్లోర్​లో అత్త ఉంటుంది. రెండో అంతస్తులో కోడలు ఉంటుంది. వీరి మధ్య గొడవలు ఉన్నాయి. కర్కర్​దోమా కోర్టులో ఓ కేసు కూడా నడుస్తోంది. సెప్టెంబర్​ 20న.. అందరు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అంజలి కోపంతో ఊగిపోయింది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో.. ఇంట్లో ఉన్న కోడలి దగ్గరకు వెళ్లి, ఆమెపై యాసిడ్​ పోసింది. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి," అని ఉస్మాన్​పూర్​ పోలీస్​ స్టేషన్​ అధికారులు వెల్లడించారు.

Acid attack on woman in Delhi : ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, ఇతరులను కూడా అరెస్ట్​ చేసి విచారిస్తామని వెల్లడించారు పోలీసులు.

కోడలిని చంపిన అత్త…!

దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ కలహాలకు మహిళలు బలైపోతున్నారు. కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఓ మహిళ, తన కోడలిని చంపించిన ఘటన నోయిడాలో ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

Mother in law kills woman : నోయిడాలోని బ్రిజ్​ విహార్​ కాలనీలో ఈ ఘటన జరిగింది. సోనీ అనే 27ఏళ్ల మహిళ.. మౌసమ్​ కుమార్​ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. కాగా.. ఈ నెల 5న సోనీ ఒంటరిగా ఉన్న సమయంలో.. ఇద్దరు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. మహిళను తుపాకీతో కాల్చి చంపేశారు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు మౌసమ్​ కుమార్​. సోనీ మొదటి భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం