తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Crime : ఖమ్మం జిల్లాలో దారుణం, కార్మికుడి మలద్వారంలో పైప్ పెట్టి గాలి కొట్టిన కిరాతకులు

Khammam Crime : ఖమ్మం జిల్లాలో దారుణం, కార్మికుడి మలద్వారంలో పైప్ పెట్టి గాలి కొట్టిన కిరాతకులు

21 September 2023, 14:33 IST

google News
    • Khammam Crime : ఖమ్మం జిల్లాలో కిరాతకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తి ఓ కార్మికుడి మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు.
గ్రానైట్ పరిశ్రమలో ఘటన
గ్రానైట్ పరిశ్రమలో ఘటన

గ్రానైట్ పరిశ్రమలో ఘటన

Khammam Crime : ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తి ఓ కార్మికుడి మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా... కోపోద్రిక్తులైన కొంతమంది కార్మికులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడి మలద్వారంలో గ్రానైట్ పాలిషింగ్ ఎయిర్ పైపు పెట్టి గాలి ఎక్కించారు. దీంతో కార్మికుడి కడుపు ఉబ్బడంతో... అతడిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గ్రానైట్ ఫ్యాక్టరీలో చపాతీ కోసం గొడవ, కార్మికుడి హత్య

చిన్న చిన్న కారణాలతో గొడవ పడి ప్రాణాలు తీసే వరకు వెళ్తోన్న సంఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. క్షణికావేశంతో జైలు పాలవుతున్నారు కొందరు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి తరహా ఘటనే ఇటీవల చోటుచేసుకుంది. గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో గ్రానైట్ కూలీల మధ్య గొడవ దారుణ హత్యకు దారితీసింది. ఒడిశాకు చెందిన లక్కీరామ్ ముర్మా, సతీష్ అనే కూలీలపై మరో బావర్ సింగ్ అనే వ్యక్తి సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సతీష్‌ ప్రాణాలు కోల్పోయాడు. గ్రానైట్ ఫ్యాక్టరీలో చేస్తున్న ఈ ముగ్గురి మధ్య చపాతీలు తింటున్న సమయంలో చిన్న ఘర్షణ జరిగింది. చేసే పని తక్కువ, తినే చపాతీలు ఎక్కువంటూ బావర్ సింగ్ ను సతీష్, ముర్మా హేళన చేశారట. ఈ మాటలను మనసులో పెట్టుకున్న బావర్‌ సింగ్, సతీష్, లక్కీరామ్‌ ముర్మా నిద్రపోతున్న సమయంలో సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్కీరామ్ ముర్మాకి తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు.

తదుపరి వ్యాసం