Delhi crime news : అప్పు తిరిగివ్వాలని అడిగినందుకు.. మహిళపై యాసిడ్ పోసి- కిరాతకంగా చంపి!
Delhi crime news : చేసిన అప్పును తిరిగి చెల్లించాలని అడిన మహిళను కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.
Delhi crime news : దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేసిన అప్పును తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను.. దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు.
ఇదీ జరిగింది..
నిందితుడు, బాధితురాలు.. దిల్లీ నిజాముద్దిన్ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నారు. నిందితుడు మహమ్మద్ జాకిర్.. రైల్వే స్టేషన్లో టెక్నికల్ సూపర్వైజర్. బాధితురాలు ఓ క్లర్క్. కాగా.. 2018-19 మధ్యలో అతనికి, ఆమె రూ. 11లక్షల వరకు అప్పు ఇచ్చింది. వివిధ మార్గాల్లో లోన్ తీసుకుని, ఆ డబ్బులను జాకిర్‌కు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న జాకిర్.. ఇప్పటివరకు వాటిని తిరిగివ్వలేదు. మహిళపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో.. అప్పు తిరిగివ్వాలని అతడిని పదేపదే అడిగింది. కానీ అతను డబ్బులు చెల్లించలేదు.
కాగా.. తన తల్లి కనిపించడం లేదని బధితురాలి కూతురు.. ఈ నెల 9న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Man kills woman : మరోవైపు 9న రాత్రి 8 గంటల ప్రాంతాల్లో మహిళ బంధువులకు ఓ ఫోన్ వచ్చింది. గ్రేటర్ నోయిడా నాలెడ్జ్ పార్క్‌లో మహిళ మృతదేహం పడి ఉందని ఫోన్లో చెప్పారు. ఈ ఘటనపై మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
దర్యాప్తులో భాగంగా.. జాకిర్ విషయం పోలీసులకు తెలిసింది. అతను డబ్బులు తిరిగి ఇవ్వలేదని అర్థమైంది. ఈ క్రమంలోనే మహిళ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు పోలీసులు గ్రహించారు. జాకిర్‌ను ప్రధాన నిందితుడిగా అనుమానించారు. మహిళ ఫోన్‌ను ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. అది స్విచాఫ్ అని వచ్చింది.
నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. 20 గంటల పాటు 60 ప్రదేశాల్లో వెతకగా.. అతను దొరికాడు. విచారణలో అసలు విషయం బయటపడింది. డబ్బులు తిరిగివ్వాలని మహిళ ఒత్తిడి చేస్తుండటంతోనే ఆమెను చంపినట్టు నిందితుడు వెల్లడించారు.
Delhi man kills woman : సెప్టెంబర 8న.. సంబంధిత మహిళ.. మధ్యాహ్నం 2 గంటలకే ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. సెలవు మీద ఉన్న జాకిర్‌ను వెతుక్కుంటూ వెళ్లింది. అతడిని కలిసి.. నిలదీసింది. అయితే.. ఆ రోజు ఆమెను చంపేందుకు జాకిర్ ఆ మహిళను కలిశాడు!
మహిళను నాలెడ్జ్ పార్క్‌కు తీసుకెళ్లిన జాకిర్.. కత్తతో ఆమెను పొడిచి చంపేశాడు. అనంతరం మహిళను ఎవరూ గుర్తుపట్టకూడదని.. ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. యాసిడ్ బాటిల్, ఆయుధాన్ని వేరే చోట పడేసి వెళ్లిపోయాడు.
సంబంధిత కథనం