తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం.. కుటుంబసభ్యుల ముందే!

Crime news : ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం.. కుటుంబసభ్యుల ముందే!

Sharath Chitturi HT Telugu

22 September 2023, 10:23 IST

google News
  • Haryana crime news : ముగ్గురు మహిళలపై గ్యాంగ్​ రేప్​ జరిగిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. నిందితులు.. మహిళలను, వారి కుటుంబసభ్యుల ముందే రేప్​ చేశారు!

ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..
ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..

ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..

Haryana crime news : హరియాణాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు దండగులు.. ముగ్గురు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ముందే.. మహిళలను రేప్​ చేశారు!

ఇదీ జరిగింది..

హరియాణాలోని పానిపట్​లో బధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. నలుగురు సభ్యుల గ్యాంగ్​ ఒకటి.. ఓ ఇంట్లోకి చొరబడింది. కుటుంబంలో కొందరి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అనంతరం వారి ఎదురుగానే.. ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

Haryana gang rape case : ఆ తర్వాత.. దుండగులు ఈ ఇంట్లో నుంచి డబ్బులు, నగలను దొంగలించి అక్కడి నుంచి పారిపోయారు.

మరో ఇంట్లో కూడా..!

కాగా.. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత, కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు.. ఓ ఇంట్లోకి చొరబడ్డారు. అనారోగంతో బాధపడుతున్న మహిళను దారుణంగా కొట్టారు. ఆమె భర్తపైనా దాడి చేశారు. అనంతరం.. ఈ ఇంట్లో నుంచి విలువైన వస్తువులు, మొబైల్​ ఫోన్​ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.

కాగా.. ఈ ఘటనలో బాధిత మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ఈ రెండు ఘటనల విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ రెండింటికీ ఒకటే గ్యాంగ్​ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

"రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరిగాయి. దర్యాప్తు చేపట్టాము. ఇంకా ఎవరిని అరెస్ట్​ చేయలేదు. కానీ ఈ రెండింటికీ ఒకటే ముఠా కారణమని భావిస్తున్నాము. నిందితులను తొందరలోనే పట్టుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాము," అని మట్లౌడా పోలీస్​ స్టేషన్​ అధికారులు వెల్లడించారు.

పెళ్లి చేసుకుంటానని..

Delhi rape case : దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, ఓ పోలీస్​ హెడ్​ కానిస్టేబుల్​, ఓ మహిళతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్న ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బాధితురాలు.. సదరు వ్యక్తిపై రేప్​ కేసు పెట్టింది.

22ఏళ్ల బాధితురాలు.. మూడేళ్ల క్రితం లక్ష్మణ్​ నగర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే.. నఫీస్​ అహ్మెద్​ అనే హెడ్​ కానిస్టేబుల్​తో పరిచయం అయ్యింది. కొంతకాలానికే వారిద్దరు ఫ్రెండ్స్​ అయ్యారు. 2021లో అహ్మెద్​.. ఆమెకు ప్రొపోజ్​ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. ఇలా కొంత కాలం గడిచింది.

నఫీస్​ అహ్మెద్​కు పీసీఆర్​లో పోస్టింగ్​ వచ్చింది. అప్పటి నుంచి మహిళతో మాట్లాడటం తగ్గించాడు. ఇది గమనించిన మహిళ.. అతడిని నిలదీసింది. వివాహం చేసుకోనని తేల్చిచెప్పాడు. అతడి గురించి ఆరా తీయగా.. కానిస్టేబుల్​కు అప్పటికే పెళ్లి అయ్యిందని, నలుగురు పిల్లలు ఉన్నారని తెలుసుకుని షాక్​ అయ్యింది. ఈ నేపథ్యంలో.. నిందితుడిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

తదుపరి వ్యాసం