Actress Jayalalitha: ఆ డైరెక్టర్ రేప్ చేశాడు.. కానీ, 6 నెలల్లో అంటూ బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు-actress jayalalitha about assistant director molestation and k viswanath ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actress Jayalalitha: ఆ డైరెక్టర్ రేప్ చేశాడు.. కానీ, 6 నెలల్లో అంటూ బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు

Actress Jayalalitha: ఆ డైరెక్టర్ రేప్ చేశాడు.. కానీ, 6 నెలల్లో అంటూ బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు

Sanjiv Kumar HT Telugu
Sep 15, 2023 11:51 AM IST

TV Actress Jayalalitha Molestation: ఒకప్పుడు హీరోయిన్‍గా, నటిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సీనియర్ నటి జయలలిత ఓ ఇంటర్వ్యూలో తనను ఓ డైరెక్టర్ రేప్ చేశాడంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

బుల్లితెర నటి జయలలిత సంచలన వ్యాఖ్యలు
బుల్లితెర నటి జయలలిత సంచలన వ్యాఖ్యలు

తెలుగులో అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు జయలలిత. నాటి తరం సినిమాల్లో హీరోయిన్‍గా నటించిన ఆమె తర్వాతి కాలంలో సైడ్ ఆర్టిస్ట్ గా చేశారు. అలాగే వ్యాంప్ పాత్రలతో ఆమె ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఆమె ఇటీవల బుల్లితెరపై ధారావాహికల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపైనే కాన్సంట్రేట్ చేసిన ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు జరిగిన రేప్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. "నేను మలయాళంలో సినిమా చేసేందుకు ఫస్ట్ టైమ్ వెళ్లాను. అందులో రేప్ సీన్ గురించి వివరించాలని గదిలోకి రమ్మన్నారు. నేను లోపలికి వెళ్లాకా అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రూమ్ గడియ పెట్టేశాడు. నేను ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయాను. అప్పుడే రేప్ చేశాడు. ఆ విషయాన్ని ఇంతవరకు నేను ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను" అని నటి జయలలిత చెప్పుకొచ్చారు.

జయలలిత ఇంకా కొనసాగిస్తూ.. "ఆ రేప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలల్లోనే చనిపోయాడు" అని తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో "నేను అమ్మ జయలలిత (తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి) పేరు పెట్టుకోవడం, వ్యాంప్ పాత్రలు చేయడంతో ఆవిడ అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఇంటిపై దాడులు కూడా చేశారు" అని జయలలిత పేర్కొన్నారు.

చిరంజీవి (Chiranjeevi) బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నట్లు జయలలిత తెలిపారు. వ్యాంప్ పాత్రల కారణంగానే ఆ ఛాన్స్ పోయిందన్నారు. అంతేకాకుండా కళాతపస్వి కే. విశ్వనాథ్ (K Viswanath) బంధువుతో పెళ్లి సంబంధం కూడా పోయిందని, కుటుంబ పోషణ కోసమే తన వద్దకు వచ్చిన పాత్రలన్నీ చేసినట్లుగా జయలలిత వెల్లడించారు.

Whats_app_banner