తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Odisha Rape Case : 80ఏళ్ల వృద్ధురాలిపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారం..!

Odisha rape case : 80ఏళ్ల వృద్ధురాలిపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారం..!

Sharath Chitturi HT Telugu

16 June 2023, 9:14 IST

google News
  • Odisha rape case : ఓ 80ఏళ్ల వృద్ధురాలు.. అత్యాచారానికి గురైన ఘటన ఒడిశాలో కలకలం సృష్టించింది. కాగా.. 30ఏళ్ల నిందితుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదని తెలుస్తోంది.

80ఏళ్ల వృద్ధురాలిపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారం..!
80ఏళ్ల వృద్ధురాలిపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారం..!

80ఏళ్ల వృద్ధురాలిపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారం..!

Odisha rape case : ఒడిశాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 80ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి రేప్​ చేశాడు. మహిళ వయస్సు కన్నా అతని వయస్సు 50ఏళ్లు తక్కువగా ఉంటుందని తెలుస్తోంది!

లిఫ్ట్​ ఇస్తానని చెప్పి..

కెంద్రపారా జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగింది ఈ అత్యాచార ఘటన. బాధితురాలు.. తన కూతురి ఇంటికి వెళ్లేందుకు, కహునా చఖ్​ బస్​స్టాండ్​కు వెళ్లింది. ఆమె అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. ఓ 30ఏళ్ల వ్యక్తి వృద్ధురాలి వద్దకు వెళ్లాడు. తాను లిఫ్ట్​ ఇస్తానని చెప్పాడు. ఆమె అతని బైక్​ ఎక్కింది.

అనంతరం ఆ వ్యక్తి.. మదన్​పూర్​ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

బాధితురాలు ప్రస్తుతం రాజ్​నగర్​లోని ఓ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో చికిత్స పొందుతోంది. ఆమెకు తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ఇప్పటివరకు నిందితుడిని పట్టుకోలేదని తెలుస్తోంది. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్టు, త్వరలోనే అతడిని అరెస్ట్​ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- UP rape case : స్కూల్​లో.. 12ఏళ్ల బాలికపై అత్యాచారం!

ముంబైలో యువతిపై లైంగిక దాడి..

దేశంలో మహిళలు, బాలికలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముంబైలో ఓ 20ఏళ్ల యువతి లైంగిక దాడికి గురైన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ట్రైన్​లో ఆమెపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా.. ఆ యువతి ధైర్యంతో అతడిని ఎదుర్కొని, తరిమికొట్టింది!

పోలీసు అధికారుల సమచారం ప్రకారం.. ముంబైలోని ఓ రైలులో గురువారం ఉదయం 7:30 గంటలకు ఈ ఘటన జరిగింది. యువతి.. సీఎస్​ఎంటీ నుంచి రైలులో బయలుదేరింది. ఆ కంపార్ట్​మెంట్​లో ఆమె మాత్రమే ఉంది. తదుపరి రైల్వే స్టేషన్​లో నిందితుడు.. బిహార్​కు చెందిన నవాజు కరీమ్​ షేక్​ రైలు ఎక్కాడు. ఒంటరిగా ఉన్న యువతిని గమనించారు. ఆమెపై లైంగిక దాడికి తెగించాడు. కానీ ఆ యువతి.. పోరాడింది. ధైర్యంగా అతడిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో అతను భయపడ్డాడు. ఆ తర్వాతి రైల్వే స్టేషన్​లో రైలు ఆగిన వెంటనే.. అక్కడి నుంచి పారిపోయాడు.

మరోవైపు తనకు ఎదురైన ఘటనను ఆ యువతి ప్రయాణికులకు చెప్పింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాక్​కు గురైన యువతికి కౌన్సిలింగ్​ ఇచ్చిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్​తో పాటు టెక్నికల్​ టీమ్​ ఇచ్చిన వివరాలతో.. నిందితుడిని కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్​ చేశారు.

తదుపరి వ్యాసం