Jharkhand rape case : 15ఏళ్ల అనాధ బాలికపై అత్యాచారం.. గదిలోకి ఈడ్చుకెళ్లి!
06 June 2023, 12:00 IST
Jharkhand rape case : అనాధ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఝార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. నిందితుడు.. ఆమెను గదిలోకి ఈడ్చుకెళ్లి రేప్ చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
15ఏళ్ల అనాద బాలికపై అత్యాచారం.. గదిలోకి ఈడ్చుకెళ్లి!
Jharkhand rape case : ఝర్ఖండ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలము జిల్లాలో ఓ 15ఏళ్ల అనాధ బాలిక అత్యాచారానికి గురైంది. పొరుగింటి వ్యక్తి ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
గదిలోకి ఈడ్చూకెళ్లి..
బాలిక తల్లిదండ్రులు మూడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆ బాలిక, తన సోదరి- సోదరుడితో కలిసి జీవిస్తోంది. వారిద్దరికి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో అనాధ పిల్లలకు లభిస్తున్న ప్రయోజనాలు వారికి వస్తున్నాయి. బాలిక కూడా.. స్థానిక మహిళా బృందాలతో కలిసి పనిచేస్తోంది.
కాగా.. పక్క ఇంట్లో ఓ 30ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ బాలికపై అతడి కన్నుపడింది. సమయం కోసం ఎదురుచూశాడు. గత శనివారం రాత్రి.. బాలిక, తన సోదరి- సోదరుడితో కలిసి నిద్రపోతుండగా.. అతను ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
Man rapes orphan minor : కొద్దిసేపటికి.. బాలిక సోదరి, సోదరుడు ఆమె దగ్గరకు వెళ్లారు. బాలిక నొప్పితో బాధపడుతూ స్పృహ కోల్పోతుండటం చూసి భయపడ్డారు. సోదరుడు వెంటనే బయటకు వెళ్లి సాయం కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్థానిక మహిళలు ఆ ఇంటికి పరుగు తీశారు. బాలికను తొలుత సబ్‌డివిజన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను మేదినీనగర్ మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో పొరుగింటి వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాలికకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య..
Rape victim's father commits suicide : అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ అకోధి గ్రామంలో కలకలం సృష్టించింది. నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని, కేసు విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని గత కొన్ని రోజులుగా ఆ తండ్రి స్థానికులకు చెబుతున్నాడు.
"రెండు నెలల క్రితం ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యమైంది. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులపై ఆగ్రహంగా ఉన్నాయి. 24 గంటల్లో రిపోర్టు వస్తుంది. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాము," అని జలౌన్ ఏఎస్పీ అసీమ్ చౌదరి తెలిపారు.