తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Rape Case : స్కూల్​ బిల్డింగ్​పై నుంచి పడి బాలిక మృతి.. గ్యాంగ్​ రేప్​ జరిగిందా?

Ayodhya rape case : స్కూల్​ బిల్డింగ్​పై నుంచి పడి బాలిక మృతి.. గ్యాంగ్​ రేప్​ జరిగిందా?

Sharath Chitturi HT Telugu

28 May 2023, 7:34 IST

google News
  • Ayodhya rape case : అయోధ్యలో 10వ తరగతి చదువుకుంటున్న ఓ బాలిక స్కూల్​ బిల్డింగ్​పై నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. కాగా.. విద్యార్థిని గ్యాంగ్​ రేప్​ జరిగినట్టు, బాలికను నిందితులు బిల్డింగ్​పై నుంచి తోసేసినట్టు ఆమె తండ్రి ఆరోపించారు.

స్కూల్​ బిల్డింగ్​పై నుంచి పడిపోయి బాలిక మృతి.. గ్యాంగ్​ రేప్​ జరిగిందా?
స్కూల్​ బిల్డింగ్​పై నుంచి పడిపోయి బాలిక మృతి.. గ్యాంగ్​ రేప్​ జరిగిందా?

స్కూల్​ బిల్డింగ్​పై నుంచి పడిపోయి బాలిక మృతి.. గ్యాంగ్​ రేప్​ జరిగిందా?

Ayodhya rape case : 15ఏళ్ల బాలిక స్కూల్​పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​ అయోధ్యలో కలకలం సృష్టించింది. స్కూల్​ సిబ్బంది బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె తండ్రి ఆరోపించారు.

అసలేం జరిగింది..?

సంబంధిత బాలిక.. అయోధ్యలోని ఓ స్కూల్​లో 10వ తరగతి చదువుకుంటోంది. వేసవి సెలవులు ఉన్నప్పటికీ.. స్కూల్​ ప్రిన్సిపాల్​ ఆమెను పిలిచినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ఆమె స్కూల్​కు వెళ్లినట్టు బాధితురాలి తండ్రి వెల్లడించారు.

"వేసవి సెలవుల్లోనూ నా బిడ్డను స్కూల్​కు పిలిచారు. ఉదయం 8:30 గంటలకు స్కూల్​కు వెళ్లింది. ఉయ్యాల ఊగుతు ఆమె కిందపడి, గాయపడిందని నాకు 9:50 గంటలకు ఫోన్​ వచ్చింది. నేను స్కూల్​కు పరిగెత్తుకుంటూ వెళ్లాను. కానీ అప్పటికే నా బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. ఆసుపత్రికి వెళితే నా బిడ్డ శరీరంపై చాలా గాయాలు కనిపించాయి. ఉయ్యాల మీద నుంచి పడితే అన్ని గాయాలవ్వవు," అని బాధితురాలి తండ్రి మీడియాకు చెప్పారు.

Ayodhya gang rape case : "స్కూల్​కు వెళ్లిన తర్వాత ప్రిన్సిపాల్​ తనను మరో ఇద్దరికి అప్పగించాడని నా బిడ్డ నాకు చెప్పింది. ఆ ఇద్దరిలో ఒకరు స్పోర్ట్స్​ టీచర్​. వారిద్దరు కలిసి నా బిడ్డపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నేరాన్ని దాచిపెట్టేందుకు.. నా బిడ్డను బిల్డింగ్​పై నుంచి తోసేశారు," అని బాలిక తండ్రి వివరించారు.

అత్యాచారం జరిగిందా..?

శుక్రవారం ఘటన జరగ్గా.. చికిత్స కోసం బాలికను మరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై బాలిక తండ్రి శనివారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

"బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్​, స్కూల్​ మేనేజర్​, స్పోర్ట్స్​ టీచర్​పై కేసు వేశాను. గ్యాంగ్​ రేప్​, మర్డర్​, ఆధారాలను చెరిపేసే ప్రయత్నం వంటి నేరాలపై కేసులు నమోదు చేశాను. పోస్టుమార్టం నివేదికలో బాలిక బిల్డింగ్​ మీద నుంచి పడిపోయిందని తేలింది. సీసీటీవీ ఫుటేజీలోనూ ఇదే కనిపించింది. కానీ బాలిక ఉయ్యాల మీద నుంచి పడిపోయిందని ప్రిన్సిపాల్​ చెప్పాడు. పోస్టుమార్టం నివేదిక అస్పష్టంగా ఉంది. దర్యాప్తునకు ఇంకాస్త సమయం పడుతుంది," అని అధికారులు వెల్లడించారు.

Ayodhya latest crime news : బాలిక దహన సంస్కారాలను ఆమె తండ్రి శనివారం నిర్వహించారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

తదుపరి వ్యాసం