Jharkhand rape case : 'అన్నా.. ప్లీజ్ వద్దు'- ఆరేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!
27 May 2023, 6:51 IST
Jharkhand rape case : ఆ వ్యక్తిని, ఆ చిన్నారి అన్నా, అన్నా అని పిలుస్తుంది. అలాంటిది.. ఆమెపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఝార్ఖండ్లో చోటుచేసుకుంది.
'అన్నా.. ప్లీజ్ వద్దు'- ఆరేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!
Jharkhand rape case : ఝార్ఖండ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇదీ జరిగింది..
ఈ ఘటన రాజధాని రాంచీ నుంచి 125కి.మీ దూరంలోని ఛాస్ ప్రాంతంలో గురువారం వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లి కిరాణా కొట్టు నడుపుతోంది. ఆ రోజు.. ఆ చిన్నారి మొదటి అంతస్తులోని పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా.. పొరుగింట్లో ఉండే నిందితుడు ఆమెను అడ్డుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు!
"అతను మాకు 5ఏళ్లుగా తెలుసు. నా కూతురిని బలవంతం చేసి, రేప్ చేశాడు. మెట్ల కింద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తను ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఆమె కింది భాగం రక్తంతో నిండిపోయింది. ఏం జరిగిందని ప్రశ్నించిగా, నా కూతురు జరిగినది వివరించింది," అని బాధితురాలి తల్లి వెల్లడించింది. "ఆ వ్యక్తిని నా కూతురు భయ్యా, భయ్యా (సోదరుడు) అని పిలిచేది," అని వివరించింది.
Minor raped in Jharkhand : బాధితురాలి కుటుంబం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం శుక్రవారం అతడిని కోర్టుకు తరలించారు.
యూపీలో మైనర్పై..
దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఓ మైనర్పై ఆమె బంధువు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా మండావాలి ప్రాంతంలో కలకలం సృష్టించింది.
ఈ నెల 21న బాధితురాలు ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది. అక్కడే ఆమెపై నిందితుడి కళ్లు పడ్డాయి. ఆమెను వెంబడించాడు. చివరికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.
మహిళపై జవాను అత్యాచారం..
22ఏళ్ల మహిళపై ఓ జవాను అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. సంబంధిత వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బాధిత మహిళ.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న గోలా కా మందిర్ ప్రాంతంలో నివాసముంటోంది. కాగా.. ఆమెకు 2019లో ఓ వ్యక్తితో పరిచయమైంది. అతను ఆ మహిళకు దూరపు బంధువు కూడా! ఇద్దరు ఒకటే ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆ వ్యక్తి ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు.
గత నెలలో.. మహిళకు అతను ఫోన్ చేశాడు. తనని కలవాలని ఓ హోటల్ పేరు చెప్పాడు. మహిళ అక్కడికి వెళ్లింది. ఆమెతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు! ఆమె ప్రతిఘటించగా.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమెతో శారీరక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అనంతరం ఆమెను ఫొటోలు, వీడియోలు తీశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.