Court Punishment: విద్యార్ధినిపై అత్యాచార యత్నం..ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు-a pocso court sentenced a teacher who attempted to rape a student to three years in prison ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  A Pocso Court Sentenced A Teacher Who Attempted To Rape A Student To Three Years In Prison

Court Punishment: విద్యార్ధినిపై అత్యాచార యత్నం..ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు

HT Telugu Desk HT Telugu
May 25, 2023 02:22 PM IST

Court Punishment: హైస్కూల్ విద్యార్ధినిపై అత్యాచార యత్నం చేసిన ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఘటనపై నేడు కోర్టు తీర్పు వెలువరించింది.

విద్యార్ధిరిపై అత్యాచారానికి యత్నించిన ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు
విద్యార్ధిరిపై అత్యాచారానికి యత్నించిన ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు (HT_PRINT)

Court Punishment: హైస్కూల్‌ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా స్పెషల్ కోర్ట్ తీర్పు వెలువరించింది. గత ఏడాది గుత్తి లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధినితో సాలవేముల బాబు అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు.

ట్రెండింగ్ వార్తలు

తరగతి గదిలోనే బాలికను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. ఉపాధ్యాయుడి చర నుండి తప్పించుకుని జరిగిన విషయాన్ని తల్లి తండ్రులకు చెప్పింది. దీంతో దిశ SOS కు ఫోన్‌ చేసి విద్యార్థిని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 354(D), పోక్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి ఆధారాలను పోక్సో ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. నిందితుడు సాలవేముల బాబుకు 3 ఏళ్ల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఏడాది వ్యవధిలోనే శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం…

హైస్కూల్ విద్యార్ధిని లైంగికంగా వేధించిన ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు పదివేల రుపాయల జరిమానా కూడా విధించారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్ధినిపై ఉపాధ్యాయుడు గత ఏడాది అఘాయిత్యానికి ప్రయత్నించాడు.బాలిక చదువుతున్న పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాలవేముల బాబు 2022 ఫిబ్రవరి 17న బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.

ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గుత్తి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేయడంతో ఇటీవల వాదనలు ముగిశాయి. ఈకేసులో నిందితుడికి మూడేళ్ల జైలుతో పాటు రూ.పదివేల రుపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మీతీర్పు వెలువరించారు.

IPL_Entry_Point