Warangal Crime : పూజలు చేసినట్టు నమ్మించి అత్యాచారం..వెలుగులోకి కీచక బాబా బాగోతం
Warangal Crime News: మంత్రాల పేరుతో దర్జాగా దందా చేస్తున్నాడు. ఇదే టైంలో పలువురు మహిళలపై కన్నేసి… కోరికలు తీర్చుకున్నాడు. ఎట్టలేకు కేటు బాబా ఆట కట్టించారు వరంగల్ నగర పోలీసులు.
Fake baba Arrest in Warangal: 40 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వచ్చాడు...! వరంగల్ లో సెటిల్ అయ్యాడు. మంచి సెంటర్ చూసి....దందా స్టార్ట్ చేశాడు. పూజలు, మంత్రాలు, మంచి, చెడు అంటూ మాటలు చెబుతూ... స్థానికులతో పాటు వచ్చిపోయే వారిని నమ్మించాడు. మూడు పువ్వులు - ఆరు కాయలు లాగా దందా నడుస్తోంది. ఇక తన దగ్గరికి వచ్చే మహిళలపై కన్నేసి.... శారీరక కోరికలను కూడా తీర్చుకుంటున్నాడు. ఎదురుతిరిగితే బెదిరిస్తాడు. రోటిన్ స్టైల్ లోనే ఓ వివాహితపై కన్నేసి... వరంగల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ ఫేక్ బాబా. నిందితుడిని అరెస్ట్ చేయటంతో పాటు... రిమాండ్ కు తరలించారు.
ఏం జరిగిందంటే...?
వరంగల్ లో నగరంలో ఓ కీచక బాబా బాగోతం బట్టబయలైంది. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతంలో షైక్నాలా లబ్బే అనే కీచక బాబాగా అవతరమెత్తాడు. తన మంత్రశక్తులతో కుటుంబంలో ఏమైనా కలహాలు, భార్య భర్తల మద్య తగాధలు మరియు ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తా అని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబరుచుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన దగ్గరికి వచ్చిన ఓ వివాహితపై కూడా కన్నేశాడు. ఆమెకు తన భర్తతో ఉన్న విబేధాలను దృష్టిలో ఉంచుకొని, పూజలు చేస్తునట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ.. తన ఇంట్లోవారికి చెప్పింది. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కీచక బాబా చీకటి దందా బయటపడింది.
వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కీచక బాబాని అరెస్ట్ చేశారు. తాను తమిళనాడు చెందిన వ్యక్తిని అని... దాదాపు 40 సం. ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు చెప్పుకొచ్చాడు. అతని వద్ద నుంచి మంత్రాలకు వాడే సామాగ్రి, తాయత్తులు, నిమ్మకాయలు, 25వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలాంటి బాబాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.