Seven-year-old girl raped: ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడి; నిందితుడి అరెస్ట్
Seven-year-old girl raped: ఇంటికి రంగులేయడానికి పిలిపించిన కార్మికుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో జరిగింది.
Seven-year-old girl raped: ఢిల్లీలోని ఘాజియాపూర్ లో ఈ దారుణం జరిగింది. ఇంటికి రంగులేయడం కోసం ఘాజియా పూర్ లో నివాసం ఉండే ఒక కుటుంబం ఒక వ్యక్తిని కాంట్రాక్ట్ కు మాట్లాడుకుంది. ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఏడేళ్ల బాలిక ఒంటరిగా ఉండడం చూసి లైంగికంగా దాడి చేశాడు.
Seven-year-old girl raped: నిందితుడి అరెస్ట్..
నిందితుడు సాజిద్ ఘాజియాపూర్ లో ఒక ఇంటికి రంగులు వేయడానికి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. మంగళవారం పనిలోకి దిగాడు. బుధవారం ఆ ఇంట్లో ఉండే మహిళ దగ్గర్లోని కిరాణా షాపుకు వెళ్తూ, ఏడేళ్ల తన కూతురిని ఇంట్లోనే ఒంటరిగా వదిలేసింది. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన సాజిద్ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతలో షాప్ నుంచి తిరిగి వచ్చిన ఆ మహిళ.. ఈ విషయాన్ని గమనించి గట్టిగా అరిచి, కేకలు పెడుతూ, నిందితుడైన సాజిద్ ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే, సాజిద్ తప్పించుకుని పారిపోయాడు. అనంతరం ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించి, చివరకు ముల్లా కాలనీలోని మయూర్ విహార్ ఫేజ్ 3 లోని ఒక ఇంట్లో సాజిద్ ను అరెస్ట్ చేశారు. ఐపీసీ, పొక్సొ తదితర చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. లైంగిక దాడికి గురైన బాలికకు హాస్పిటల్ లో పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ జరిపారు.