UP rape case : స్కూల్లో.. 12ఏళ్ల బాలికపై అత్యాచారం!
UP rape case : ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ స్కూల్లో.. ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఓ జూడో టీచర్ ఆమెను రేప్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
UP rape case : ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూడో శిక్షణ కోసం స్కూల్‌కు వెళ్లిన ఓ 12ఏళ్ల బాలికను.. టీచర్ రేప్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు!
ఇదీ జరిగింది..
బాధితురాలు కంకర్ఖేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్లో చదువుకుంటోంది. కాగా.. జూన్ 2న జూడో క్లాస్ కోసం ఉదయం 7 గంటలకు స్కూల్‌కు వెళ్లింది. బాలిక సోదరుడు కూడా ఆమెతో పాటు వెళ్లాడు. జూడో ఇన్స్ట్రక్టర్.. 10 గంటల వరకు క్లాస్ చెప్పాడు. ఆ తర్వాత ఆ బాలికను తప్ప మిగిలిన అందరిని ఇంటికి పంపిచేశాడు. ఆమెకు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటానని అన్నాడు. అది నమ్మిన బాలిక, తన సోదరిడితో కలిసి అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత.. బాలికను గార్డ్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కొద్ది సేపటి తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చి, బాలిక సోదరిడిని కలిశాడు. 'మీ అక్కకి ప్రాక్టీస్ చేస్తుండగా దెబ్బ తగిలింది. రక్తం వస్తోంది. డ్రెసింగ్ చేయాలి. వెళ్లి బ్యాండేజ్ తీసుకురా. నువ్వు చాక్లెట్లు కొనుక్కో,' అని డబ్బులిచ్చాడు. అనంతరం ఆమెకు డ్రెస్సింగ్ చేసి స్థానిక నర్సింగ్ హోంలో చేర్పించాడు.
ఇదీ చూడండి:- Madurai crime news : ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం.. ఆపై గోల్డ్ దోచుకుని పరారీ!
తన బిడ్డకు దెబ్బ తగిలిందని తెలుసుకున్న బాలిక తండ్రి.. నర్సింగ్ హోంకు వెళ్లాడు. వైద్యులను ఆమె పరిస్థితి గురించి అడిగాడు. బాలికకు దెబ్బ తగిలి ఉండదని, స్కూల్లో ఏదో జరిగి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. బాలికను ప్రశ్నించగా.. జూడో టీచర్ చేసింది వివరించింది. అతడిని పట్టుకునేందుకు బాలిక కుటుంబసభ్యులు స్కూల్‌కు వెళ్లారు. కానీ అప్పటికే అతను పారిపోయాడు.
Uttar Pradesh crime news : తన కూతురిపై జరిగిన అత్యాచార ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని బాధితురాలి కుటుంబానికి హామీనిచ్చారు.
సంబంధిత కథనం