తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usa Crime News: క్రమశిక్షణ పేరుతో నాలుగేళ్ల బాలుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కిన తండ్రి; ఆ చిన్నారి మృతి

USA Crime news: క్రమశిక్షణ పేరుతో నాలుగేళ్ల బాలుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కిన తండ్రి; ఆ చిన్నారి మృతి

HT Telugu Desk HT Telugu

05 June 2024, 16:02 IST

google News
    • క్రమశిక్షణ పేరుతో నాలుగేళ్ల కుమారుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కి, ఆ బాలుడి మరణానికి కారణమైన సింగపూర్ వ్యక్తికి ఎనిమిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన రెండేళ్ల క్రితం సింగపూర్ లో జరిగింది. టాయిలెట్ ఉపయోగించకుండా, బయట మల విసర్జన చేసినందుకు ఆ బాలుడిని తండ్రి ఆ విధంగా రాక్షసంగా శిక్షించాడు.
నాలుగేళ్ల బాలుడి నోట్లో మిర్చీ కుక్కిన తండ్రి
నాలుగేళ్ల బాలుడి నోట్లో మిర్చీ కుక్కిన తండ్రి (UnSplash)

నాలుగేళ్ల బాలుడి నోట్లో మిర్చీ కుక్కిన తండ్రి

రెండేళ్ల క్రితం, క్రమశిక్షణ పేరుతో తన నాలుగేళ్ల కుమారుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కి, ఆ బాలుడి మరణానికి కారణమైన సింగపూర్ వ్యక్తికి ఎనిమిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన 2022 ఆగస్ట్ లో సింగపూర్ లో చోటు చేసుకుంది.

బయట టాయిలెట్ కు వెళ్లాడని..

చిన్న పిల్లలకు సాధారణంగా టాయిలెట్ ఉపయోగించడంపై చిన్న వయస్సు నుంచే శిక్షణ ఇస్తుంటారు. అలా తన కుమారుడికి కూడా ఆ 38 ఏళ్ల తండ్రి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. 2022 ఆగస్టులో కుమారుడితో కలిసి ఆ తండ్రి సింగపూర్లోని తన ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ 4 ఏళ్ల బాలుడు టాయిలెట్ ఉపయోగించకుండా, బయటే మలవిసర్జన చేశాడు. దాంతో, ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. తప్పు చేసిన కొడుకును శిక్షించాలనుకున్నాడు. ఆ బాలుడు ఏడుస్తున్నా, పట్టించుకోకుండా, పచ్చి మిర్చీని బలవంతంగా ఆ బాలుడి నోట్లో కుక్కాడు. ఏడుస్తూ, ఆ బాలుడు గది అంతా పరుగులు పెట్టాడు. తన గొంతు వైపు చూపుతూ సైగలు చేస్తూ కాసేపటికి కుప్పకూలి స్పృహ కోల్పోయాడు.

హుటాహుటిన ఆసుపత్రికి..

తల్లి ఎంత ప్రయత్నించినా బాలుడి పరిస్థితి మెరుగుపడకపోవడంతో అంబులెన్స్ కోసం కాల్ చేసింది. చివరకు తండ్రి ఆ బాలుడిని ఎత్తుకుని సమీపంలోని ఫ్యామిలీ క్లినిక్ కు తీసుకెళ్లాడు. అప్పటికే చిన్నారి పల్స్, శ్వాసను కోల్పోయినట్లు సమాచారం. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శవపరీక్షలో మిర్చి ముక్క బాలుడి శ్వాసనాళంలో ఇరుక్కుపోయినట్లు తేలింది. ఆ బాలుడి తల్లిదండ్రులకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేరంపై ఆ బాలుడి తండ్రికి స్థానిక కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. ‘‘మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మీరు ఇలాంటి పద్ధతిని అవలంబించడం సరికాదు’’ అని శిక్ష ప్రకటిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం