తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్నాక్ మిర్చి బజ్జీ. పచ్చి మిరపకాయలను పిండితో కలిపి వేయిస్తారు. ఆంధ్రా స్టైల్ లో కరకరలాడే మిర్చి బజ్జీని రెసిపీ తెలుసుకుందాం.   

twitter

By Bandaru Satyaprasad
Mar 27, 2024

Hindustan Times
Telugu

మిర్చి బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు- 10 బజ్జీ మిరపకాయలు, 1 కప్పు లేదా 120 గ్రా. శనగ పిండి,  1/4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 20 గ్రాముల చింతపండు, 2 టేబుల్ స్పూన్ల వామ్ము, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె.  

twitter

మిర్చి బజ్జీ తయారీ విధానం- మిరపకాయలను మధ్యగా చీల్చి, లోపలి గింజలు తీసేయాలి. మిర్చీ కాండంతో ఉంచండి.  ఆంధ్రా స్టైల్ లో వామ్ము, చింతపండు పేస్ట్, తగినంత ఉప్పును కలిపి మిర్చి మధ్యలో స్టఫ్ చేసుకోవాలి.   

twitter

ఒక ఉల్లిపాయ, తగినంత కొత్తిమీర చిన్నగా తరిగి ఒక గిన్నెలో వేయండి. అలాగే నిమ్మకాయ రసం,  కారం పొడి, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు సిద్ధం చేసుకోండి. మిర్చి బజ్జీ రెడీ అయ్యాక వీటితో స్టఫింగ్ చేసుకోవచ్చు.   

twitter

మిర్చీ బజ్జీ పిండి తయారీ- ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి లేదా బియ్యం పిండి తీసుకోండి. దీనిలో తగినంత ఉప్పు, బేకింగ్ సోడా, వామ్ము, కొద్దిగా కారం, పసుపు కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి ¾ కప్పు నీరు కలపండి. ఒకేసారి ఎక్కువ నీరు పోయకూడదు.  పిండి ముద్దలు లేకుండా జారుగా తయారు చేయండి.  

twitter

మిర్చీ పిండిలో ముంచేలా మొత్తం అంటుకునేలా మిశ్రమాన్ని కాస్త చిక్కగా తయారు చేసుకోండి. ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయండి. నూనె కాగే లోపు స్టఫ్ చేసిన మిర్చీలను పిండిలో నానబెట్టండి.   

twitter

నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ముందుగా కొంచెం పిండిని నూనెలో వేసి పరీక్షించుకోండి.  పిండి గోధుమ రంగులోకి మారితే బజ్జీలు వేసేందుకు రెడీ అయినట్లు భావించండి.   

twitter

ఇప్పుడు పిండిలో వేసుకున్న మిర్చీలను కాండం పట్టుకొని పిండి పూర్తి అద్దేలా చేసి కాగుతున్న నూనెలో వేయండి. ఇలా మిర్చీలను పిండిలో ముంచుతూ  కడాయిలో వేయిండి. మిర్చీ బజ్జీలు గోధుమ రంగులోకి మారుతున్నపుడు వాటిని నూనెలో తిప్పుతూ పూర్తిగా ఫ్రై అయ్యేటట్టు చూడండి.   

twitter

మిర్చీ బజ్జీ బాగా వేయినట్లు కనిపిస్తే వాటిని నూనెలోంచి తీసి ఓ టిష్యూ పేపర్ లో వేయండి. ఈ మిర్చీ బజ్జీని మధ్యగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలా(ఆప్షనల్) స్టఫ్ చేసుకోండి. తర్వాత వేడి వేడి కరకరలాడే మిర్చీ బజ్జీని ఆస్వాదించండి.   

twitter

ప్రశాంతంగా జీవించేందుకు ఈ ఐదు టిప్స్ పాటించండి

Photo: Pexels