Medchal Road Accident : మేడ్చల్ లో విషాదం, ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన డీసీఎం- 13 ఏళ్ల బాలుడు మృతి-medchal outer ring road accident dcm dashed car 13 year old boy died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medchal Road Accident : మేడ్చల్ లో విషాదం, ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన డీసీఎం- 13 ఏళ్ల బాలుడు మృతి

Medchal Road Accident : మేడ్చల్ లో విషాదం, ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన డీసీఎం- 13 ఏళ్ల బాలుడు మృతి

HT Telugu Desk HT Telugu
May 26, 2024 03:26 PM IST

Medchal Road Accident :మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు నిలిపి ఉంచిన కారును వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 ఏళ్లు మృతి చెందాడు.

మేడ్చల్ లో విషాదం, ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన డీసీఎం- 13 ఏళ్ల బాలుడు మృతి
మేడ్చల్ లో విషాదం, ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన డీసీఎం- 13 ఏళ్ల బాలుడు మృతి

Medchal Road Accident : ఆ కుటుంబమంతా కారులో ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న కొందరికి కారు ప్రయాణం పడకపోవడంతో వాంతులు రాగా రోడ్డు పక్కకు ఆపారు. అయితే డీసీఎం రూపంలో మృత్యువు దూసుకొచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదమూడేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ శనివారం మధ్యాహ్నం తన భార్య రామదేవి, కుమారుడు రామ్, తల్లి రమణమ్మ, వరంగల్ కు చెందిన అక్క దీప్తి, అల్లుడు పూజిత్ రామ్ (13), కోడలు వేదశ్రీతో కలిసి బీబీనగర్ వెళ్లేందుకు తమ కారులో బయల్దేరారు. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు చేరుకోగానే కారులో ఉన్న అల్లుడు పుజిత్ రామ్, భార్య రమాదేవి వాంతులు వస్తున్నాయని....కారు ఆపమని కోరారు. దీంతో విద్యా సాగర్ కారును ఔటర్ రింగ్ రోడ్డుపై ఎడమ వైపు ఆపాడు. అల్లుడు పూజిత్ రామ్ తిరిగి కారు ఎక్కుతుండగా......అదే మార్గంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ డీసీఎం వీరి కారును డీ కొట్టింది. ఈ ప్రమాదంలో పూజిత్ స్పాట్ లోనే మరణించగా.....విద్యాసాగర్, రామాదేవీలకు గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాల వ్యాన్ ఢీ కొని వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో పాల వ్యాన్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లగొండ వన్ టౌన్ ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన మాధని ఆంటోనీ (55) వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బైక్ పైన పని నిమిత్తం నల్లగొండకు వస్తుండగా మార్గమధ్యలో మౌంట్ ఫోర్ట్ స్కూల్ వద్ద ఎదురుగా పాల వ్యాన్ వచ్చి ఢీ కొట్టడంతో ఆంటోనీకి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.....చికిత్స పొందుతూ ఆంటోనీ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టిప్పర్ లారీ ఢీకొని యువకుడు మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని సిర్ణపాలి సమీపంలో శనివారం రాత్రి టిప్పర్ లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (18) అనే యువకుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner