Nalgonda Ellayya Murder: దొరికిన నల్గొండ కాంగ్రెస్ నాయకుడి డెడ్ బాడీ.. అంత్యక్రియలు పూర్తి
Nalgonda Ellayya Murder: సంచలనం సృష్టించిన నల్గొండ కాంగ్రెస్ నాయకుడు ఎల్లయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోనే మృతదేహాన్ని కనుగొన్నారు.
Nalgonda Ellayya Murder: నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్లయ్య హత్య కేసులో చిక్కుముడి వీడింది. మృతదేహాన్ని దొరక్కుండా చేస్తే హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించిన నిందితుడు శవాన్ని విశాఖపట్నం తీసుకెళ్లి సముద్రంలో పడేసినట్టు పోలీసులకు చెప్పాడు. బుధవారం ఎల్లయ్య శవాన్ని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోనే గుర్తించారు.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఎల్లయ్య అదృశ్యం Missing Case కేసు మిస్టరీ వీడింది. మావోయిస్టు పార్టీ నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం సెటిల్‌మెంట్లు Settlements చేస్తున్న ఎల్లయ్యను, మరో Ex Maoist మాజీ మావోయిస్టు శ్రీకాంతాచారి పథకం ప్రకారం హత్య చేసినట్టు గత వారం గుర్తించారు. హత్య తర్వాత శవాన్ని విశాఖపట్నం తరలించి సముద్రంలో పడేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
బుధవారం హత్యకు గురైన సూర్యాపేట కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డె ఎల్లయ్య మృతదేహం జగ్గయ్యపేటలోనే లభ్యమైంది. ఎల్లయ్యను అతని ప్రత్యర్థి, నాగారం మండలం మాచిరెడ్డిపల్లికి చెందిన శ్రీకాంతాచారి పథకం హత్య చేశాడు.
భార్యాభర్తల పంచాయితీ తీర్చాలని, అపర్ణ అనే మహిళ సాయంతో ఎల్లయ్యను జగ్గయ్యపేటకు రప్పించిన శ్రీకాంతాచారి, రైల్వేస్టేషన్ రోడ్ సమీపంలో అద్దెకు తీసుకున్న ఇంటిలో హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు సూర్యాపేటలో రెవిన్యూ సిబ్బంది వద్ద లొంగిపోయాడు. ఈ కేసు దర్యాప్తులో శవాన్ని చేపల లారీలో విశాఖ తీసుకెళ్లి సముద్రంలో పడేసినట్టు పోలీసులకు చెప్పాడు. మృతదేహం దొరక్క పోతే కేసు నుంచి బయట పడొచ్చని భావించి శ్రీకాంతాచారి పోలీసుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు విశాఖలో కూడా గాలింపు చేపట్టారు.
బుధవారం ఉదయం జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులో రైతులు గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. మృతదేహం దుర్వాసన వస్తోందని పశువుల కాపరులు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుర్వాసన వస్తున్న ప్రాంతంలో శవాన్ని పూడ్చినట్టు గుర్తించి అక్కడ తవ్వించారు. ఆ ప్రాంతంలో సగం కాలిన శవాన్ని బయటకు తీసి జగ్గయ్యపేట తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
ఎల్లయ్య కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు శ్రీకాంతాచారి కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి సముద్రంలో పారేశామని చెప్పాడని సీఐ జానకీరామ్ వివరించారు. ఎల్లయ్య మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించి, సగం కాలిన తర్వాత పాతిపెట్టినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని ఎల్లయ్య స్వగ్రామం యార్కారంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎల్లయ్య మాజీ నక్సలైట్ కావడంతో.. అంత్యక్రియలకు పలువురు మాజీ మావోయిస్టులు హాజరయ్యారు.
ఏం జరిగిందంటే…
ఏప్రిల్ 19న ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో సెటిల్‌మెంట్ కోసం వచ్చిన అదృశ్యమైన ఎల్లయ్య హత్యకు గురయ్యాడు. జగ్గయ్యపేటలో అదృశ్యమైనట్లు కేసు నమోదైన తర్వాత, వడ్డె ఎల్లయ్యను తానే కొంత మందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేటకు చెందిన తాడూరి శ్రీకాంత చారి తహశీల్దార్ ఎదుట లొంగిపోయాడు.
అప్పటికే ఎల్లయ్య సోదరుడు సతీష్ ఫిర్యాదుతో జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేశారు. నిందితుడు సూర్యాపేట పోలీసులకు లొంగిపోవడంతో సూర్యాపేట పోలీసులు అతడిని జగ్గయ్యపేట తరలించారు.
మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఎల్లయ్య కొన్నేళ్ల క్రితం జనజీవన స్రవంతిలో కలిశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మాజీ మావోయిస్టుగా ఉన్న అనుభవంతో సెటిల్‌మెంట్లు దందాలకు పాల్పడే వాడు. ఈ క్రమంలో మరో మాజీ మావోయిస్టు శ్రీకాంతాచారితో అతని వివాదాలు ఏర్పడ్డాయి. నగదు విషయంలో తలెత్తిన విభేదాలతో ఎల్లయ్యను చంపాలని శ్రీకాంతాచారి నిర్ణయించుకున్నాడు.
ఫ్యామిలీ సెటిల్‌మెంట్లలో ఎల్లయ్యకు అనుభవం ఉండటంతో అలాగే ట్రాప్ చేయాలని నిర్ణయించాడు. అపర్ణ అనే మహిళ సాయంతో ఎల్లయ్యకు వల వేశాడు. ఎల్లయ్య బంధువు వెంకన్న ద్వారా ఓ మహిళను సెటిల్‌మెంట్ కోసం అతడి దగ్గరకు పంపాడు. ఆమెకు భర్తతో విభేదాలు ఉన్నాయని, విడాకులతో పాటు భరణం ఇప్పించాలని ఆమె అతడిని ఆశ్రయించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే పథకం పారదని భావించి కోదాడకు సమీపంలో ఉండే జగ్గయ్యపేటలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
అపర్ణతో పాటు సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్‌లు సహజీవనం చేస్తున్నారని, వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోవడానికి పరిహారం ఇప్పించాలని ఎల్లయ్యను ఆశ్రయించింది. ఏప్రిల్ 18న అనుచరులతో జగ్గయ్యపేట చేరుకున్న నిందితుడు శ్రీకాంతాచారి విజయవాడ రోడ్డులోని ఎస్ఎస్ కాలేజీ దగ్గర ఎల్లయ్యను కలిశారు. దంపతులతో సెటిల్‌మెంట్‌లో భాగంగా సూర్యాపేట వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఎల్లయ్యను ఒంటరిగా తీసుకెళ్లారు. ఎల్లయ్యను జగ్గయ్యపేట తీసుకొచ్చిన మహిళతో పాటు ఎల్లయ్య స్నేహితుడు అంజయ్య టీ స్టాల్ సమీపంలో ఉండిపోయారు.
కాసేపటి తర్వాత అపర్ణ తాను టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెప్పడంతో అంజయ్య ఆమెను జగ్గయ్యపేట బస్టాండ్ తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. ఎల్లయ్య ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానించిన అంజయ్య వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
డబ్బులిస్తానని అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లిన ఎల్లయ్యను తన అనుచ రుల సాయంతో శ్రీకాంతచారి చంపేశారు. నిందితుడు శ్రీకాంతాచారిపై ఇప్పటికే 34 కేసులు ఉన్నాయి. నల్గొండలో హత్య చేస్తే పోలీసులకు దొరికిపోతానని జగ్గయ్యపేటను ఎంచుకున్నట్లు వివరించారు. ఈ