
ముఖ్యమంత్రి సహాయ నిధి స్కీమ్ లో అక్రమాలకు పాల్పడిన వారిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్కులను కాజేసి సొమ్ము చేసుకున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే వద్ద పని చేసిన ఇద్దరు వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు.


