Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం,కారును ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి-tsrtc bus collided with a car in rangareddy district killing three ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం,కారును ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి

Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం,కారును ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి

Sarath chandra.B HT Telugu
May 24, 2024 09:57 AM IST

Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఆర్టీసీ బస్సును, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఆమన్‌గల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆమన్‌గల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమన్ గల్‌ అయ్యసాగర్‌ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

కల్వకుర్తి నుంచి వస్తున్న కారును తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. కారును బస్సు ఈడ్చుకెళ్లడంతో రోడ్డంతా బీతావహంగా మారింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్టు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిని గుర్తించాల్సి ఉంది.