తెలుగు న్యూస్  /  National International  /  '30,000 Security Officials, Night Patrolling': Delhi Readies For Mcd Poll

Delhi readies for MCD poll: ఆప్, బీజేపీల ‘ఢిల్లీ’ పోరుకు రంగం సిద్ధం

HT Telugu Desk HT Telugu

02 December 2022, 22:27 IST

  • Delhi readies for MCD poll: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తగ్గకుండా జరిగిన ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం MCD ఎన్నికలు జరగనున్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Sonu Mehta/HT PHOTO)

ప్రతీకాత్మక చిత్రం

Delhi readies for MCD poll: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (Municipal Corporation of Delhi MCD) ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాటు పూర్తయ్యాయని ఎస్పీ హుడా వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Delhi readies for MCD poll: 250 వార్డులు

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 250 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికలను బీజేపీ, ఆప్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు పార్టీలు మొత్తం 250 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్ పార్టీకి 247 సీట్లలో అభ్యర్థులున్నారు. మొత్తం 250 స్థానాలకు గానూ 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డుల పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ముగిసింది.

Delhi readies for MCD poll: 30 వేల సెక్యూరిటీ సిబ్బంది

ఈ ఎన్నికల్లో శాంతి భద్రతల నిర్వహణకు సుమారు 30 వేల మంది భద్రత సిబ్బందిని నియోగించారు. వీరిలో సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, హోం గార్డులున్నారు. సున్నిత ప్రాంతాల్లోని బూత్ ల్లో ఎక్కువమంది గార్డులను ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే ఆదివారం రోజు ఉదయం నాలుగున్నర నుంచే మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయి.

Delhi readies for MCD poll: మూడు రోజులు డ్రై డేస్

అలాగే, ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆల్కహాల్ అమ్మకాలపై ఢిల్లీలో నిషేధం విధించారు. శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి ఆదివారం ఎన్నికలు ముగిసే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అలాగే, ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 7వ తేదీన కూడా ఆల్కహాల్ అమ్మకాలపై నిషేధం ఉంటుంది.

టాపిక్