తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Indians Have Less Sleep All You Need To Know

Sleeping Habits : భారతీయులు ఎందుకు తక్కువగా నిద్రపోతారో తెలుసా?

HT Telugu Desk HT Telugu

01 April 2023, 20:00 IST

    • Sleeping Habits : చాలామంది భారతీయులు నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం తెలుసా?
నిద్ర సమస్యలు
నిద్ర సమస్యలు

నిద్ర సమస్యలు

జీవన శైలి మారింది. ప్రజలు నిద్రలేమి(Sleeping Disorder) సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్రరాదు. భారతీయుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రాత్రి హాయిగా నిద్ర పోదామని అనుకున్నా.. మళ్లీ లేటుగా నిద్రపోతారు. ఏదో ఒక పనితో.. ఆలస్యంగా నిద్ర పోవడం అనేది ఇండియన్స్ కు అలవాటైంది. నేటి ఆధునిక జీవనశైలి(Lifestyle)తో నిద్రలేమి అనేది సాధారణ సమస్యగా మారింది. చాలా మంది భారతీయులు నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు.

Wakefit గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ (GISS) ప్రకారం, భారతీయులు తక్కువగా నిద్రపోతున్నారు. GISS 2018 నుండి భారతదేశ నిద్ర అభ్యాసాన్ని ట్రాక్ చేస్తోంది. ఈ అధ్యయనాల ప్రకారం, మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించేవారిలో నిద్ర సమస్య ఉంటుంది. నలుగురు భారతీయులలో ఒకరికి నిద్రలేమి సమస్య ఉంది.

చాలా మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రిస్తారు. దీనికి ఒక పెద్ద కారణం సోషల్ మీడియా(Social Media). సామాజిక మాధ్యమాల్లో బ్రౌజ్ చేయడం కూడా నిద్ర సమస్యకు(Sleeping Problem) కారణం. 36 శాతం మంది ప్రజలు తమ నిద్రకు సోషల్ మీడియా నుండి ప్రభావితమయ్యారు అని అంగీకరించారు. ఇక అనేక మంది.. నిద్రపోయే ముందు తమ ఫోన్‌లలో సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ చూస్తున్నట్టుగా అంగీకరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. కొవిడ్ 19 తర్వాత రాత్రిపూట సామాజిక మాధ్యమాల్లో కాలాన్ని గడిపే అలవాటు పెరిగింది.

కోల్‌కత్తాలో 40 శాతం ప్రజలు మధ్యరాత్రి తర్వాత పడుకుంటారు. హైదరాబాద్‌లో 40 శాతం ప్రజలు పని చేయడం వల్ల ఆలస్యంగా నిద్రపోతున్నారు. గురుగ్రామ్‌న 36 శాతం మంది ప్రజలు పని చేయడం ఆలస్యం అవుతోంది. ముంబైలో 39 శాతం ఫోన్స్ చూసి.. సమయం వృథా చేసి.. నిద్రపోవట్లేదు.

కానీ త్వరగా పడుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మనం త్వరగా పడుకున్నప్పుడు, మన శరీరానికి విశ్రాంతి, మళ్లీ తిరిగి శక్తి పొందడానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది మెరుగైన మానసిక స్థితి, పెరిగిన ఉత్పాదకత సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉంటాయి. తగినంత నిద్ర పొందడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు(Heart Disease), ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దూరం ఉండొచ్చు.

త్వరగా పడుకోవడం వల్ల మన శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఒత్తిడి(Stress)కి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మన ఒత్తిడి ప్రతిస్పందనకు కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా రాత్రి ప్రారంభ గంటలలో తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకోవడం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.