Most followed IPL teams: సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఐపీఎల్ టీమ్స్ ఇవే
Most followed IPL teams: సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఐపీఎల్ టీమ్స్ ఏవో తెలుసా? శుక్రవారం (మార్చి 31) నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ టీమ్ కు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసుకోండి.
Most followed IPL teams: సోషల్ మీడియాలో ఐపీఎల్ జట్లకు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అసలు అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది.
అందరూ ఊహిస్తున్నట్లే ఈ లిస్టులో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం విశేషం. తొలి సీజన్ నుంచే ఈ జట్టుకు ధోనీ వల్ల ఎక్కడలేని ఫాలోయింగ్ వచ్చింది. అందుకు తగినట్లే నాలుగు టైటిల్స్ తో క్రమంగా సీఎస్కే పేరు మారుమోగిపోయింది. మధ్యలో రెండు సీజన్ల పాటు నిషేధం విధించినా కూడా సీఎస్కే ఫాలోయింగ్ తగ్గలేదు.
ఎక్కువ మంది ఫాలో అవుతున్న ఐపీఎల్ టీమ్స్
- గురువారం (మార్చి 30) నాటికి చెన్నై సూపర్ కింగ్స్ 3.38 కోట్ల మంది ఫాలోవర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు కలిపి చెన్నై టీమ్ ను ఇంత మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకూ ఆ టీమ్ 9 ఫైనల్స్ ఆడిన నాలుగు గెలిచింది.
- ఇక ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ లిస్టులో రెండోస్థానంలో ఉంది. ఈ ఫ్రాంఛైజీకి సోషల్ మీడియాలో 3.23 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
- ఇప్పటి వరకూ ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.66 కోట్ల మంది ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత రెండుసార్లు టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కు 2.57 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
- బాలీవుడ్ నటి ప్రీతి జింటా కో ఓనర్ గా ఉన్న పంజాబ్ కింగ్స్ 1.44 కోట్ల మంది ఫాలోవర్లతో ఐదోస్థానంలో ఉంది.
- ఇక ఆరు, ఏడు స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (1.42 కోట్లు), సన్ రైజర్స్ హైదరాబాద్ (1.24 కోట్లు) ఉన్నాయి.
- 2008లో తొలి ఐపీఎల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కు 1.04 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
గత సీజన్ లోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీలు కూడా ఇప్పటి వరకూ చెప్పుకోదగిన రీతిలోనే ఫాలోవర్లను సంపాదించుకున్నాయి. తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచిన గుజరాత్ కు 30 లక్షల మంది, ప్లేఆఫ్స్ చేరుకున్న లక్నోకు 27 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
సంబంధిత కథనం