తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nuts At Night : రాత్రిపూట గింజలు తినవచ్చా? తింటే ఏమవుతుంది?

Nuts At Night : రాత్రిపూట గింజలు తినవచ్చా? తింటే ఏమవుతుంది?

Anand Sai HT Telugu

09 February 2024, 19:00 IST

google News
    • Nuts At Night : గింజలు ఆరోగ్యానికి మంచివి. అయితే కొందరికి నిద్రపోయేముందు ఆహారాలు తినే అలవాటు ఉంటుంది. ఇలా పడుకునే ముందు తినడం మంచిదేనా?
రాత్రి సమయంలో నట్స్ తినొచ్చా?
రాత్రి సమయంలో నట్స్ తినొచ్చా? (Unsplash)

రాత్రి సమయంలో నట్స్ తినొచ్చా?

రాత్రిపూట మనం తినే ఆహారం నిద్రకు సంబంధం కలిగి ఉంటుంది. అందుకే రాత్రిపూట ఎక్కువ ఆహారం తీసుకోకూడదని అంటారు. అలాగే శారీరక శ్రమ లేని కారణంగా రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. రాత్రిపూట మీరు తినే ఆహారం మీ శరీరానికి అనవసరమైన కేలరీలను ఇవ్వడంలో ప్రధాన అంశం. ఎక్కువ క్యాలరీలు తీసుకుంటూ దానికి అనుగుణంగా వ్యాయామం చేయకపోతే అవి కొవ్వుగా పేరుకుపోతాయి. అందుకే రాత్రి భోజనాన్ని స్నాక్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

మీరు అథ్లెట్ అయినా లేదా తక్కువ శారీరక శ్రమ చేసే వ్యక్తి అయినా.. మీకు డయాబెటిస్ సమస్య ఉంటే.. మీ శారీరక అవసరాలకు అనుగుణంగా డిన్నర్‌ను ఎంచుకోవచ్చు. చాలా శారీరక శ్రమ చేస్తే మీరు మీ డిన్నర్‌లో ఎక్కువ ప్రోటీన్‌ను జోడించవచ్చు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

చాలా మందికి రాత్రిపూట జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా సేపు మెలకువగా ఉండడం, ఆ సమయంలో ఆకలి వల్ల స్నాక్స్ తీసుకోవడం సర్వసాధారణం. కొందరు ఆహారం విషయంలో కఠినంగా ఉంటారు. రాత్రి పడుకునే ముందు పండ్లు, గింజలను స్నాక్‌గా తీసుకుంటారని చెబుతుంటారు. పండ్లు, గింజలు ఆరోగ్యకరం. అయితే రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకోవడం ఆరోగ్యకరమేనా?

ఆరోగ్యకరమైనవే.. కానీ

నట్స్ హెల్తీ స్నాక్స్. బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నట్స్‌లో బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్ష, వాల్‌నట్‌లాంటివి ఉంటాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. సులభంగా శక్తిని అందిస్తాయి. కొన్ని నట్స్‌లో కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి ఎక్కువగా తినకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ రోజువారీ ఆహారంలో గింజలను క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు.

గింజలు ఆరోగ్యంగా ఉంటాయని, రాత్రిపూట టీవీ చూస్తూ తింటామని గొప్పగా చెబుతారు. ఇది మంచి అలవాటు కాదు. గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాటిలో కొవ్వు ఉంటుంది.. బరువు పెరుగుతారు. అవి ఆహార జీర్ణక్రియను కూడా నిరోధిస్తాయి. ఇది రాత్రి కడుపు నొప్పితో సహా జీర్ణ రుగ్మతలకు కారణమవుతుంది.

జీర్ణ సమస్యలు

ఆరు నుండి ఎనిమిది గంటల పాటు మీ శరీరానికి నిద్రలో అవసరమైన ఆహారం, నీరు లభించదు. ఈ సమయంలో అవయవాలు తమకు అవసరమైన శక్తిని స్వయంచాలకంగా తీసుకుంటాయి. రాత్రిపూట పోషకాహారం అని పిలవబడే ఏదీ తీసుకోవద్దు. ఎందుకంటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో నిద్ర పట్టదు. జీర్ణసమస్యలు వస్తాయి.

రాత్రి నట్స్ తినొచ్చా?

రాత్రి పడుకునే గంట ముందు భోజనం లేదా స్నాక్స్ ఏదైనా తీసుకోండి. అవి రాత్రంతా మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి . రాత్రిపూట నట్స్ తినవలసి వస్తే నిద్రవేళకు కనీసం అరగంట ముందు తినండి. కాల్చినవి అయితే మరీ మంచిది. ఎందుకంటే వేయించిన గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉంటాయి. మెుత్తానికి రాత్రిపూట గింజలు తినకపోవడమే ఉత్తమం. అవసరమైతే ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో తినవచ్చు. రాత్రి తింటే జీర్ణసమస్యలు, నిద్ర సమస్యలు కచ్చితంగా ఎదుర్కొంటారు.

తదుపరి వ్యాసం