తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Quote : ముద్దును కూడా యాంత్రికంగా చేస్తున్నారంటే.. మీరు ఇంకేం బతుకుతున్నారబ్బా?

Wednesday Quote : ముద్దును కూడా యాంత్రికంగా చేస్తున్నారంటే.. మీరు ఇంకేం బతుకుతున్నారబ్బా?

17 August 2022, 7:12 IST

    • Wednesday Motivation : ఎవరి జీవితం వారికి ముఖ్యమైనదే. అందుకే దానిని అందరూ సీరియస్​గా తీసుకుంటాము. కానీ అదే సమయంలో మన అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లైఫ్ చాలా చిన్నది. దానిని పూర్తిగా జీవించగలిగితే అది మీకు మంచిది. కాబట్టి మనసులో ప్రతికూల ఆలోచనలు తీసేసి.. హ్యాపీగా నవ్వుతూ బతికేయండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : మనందరికీ జీవితాన్ని ఆనందించడానికి ఒకే ఒక్క అవకాశం లభిస్తుంది. అది బతికున్నప్పుడు మాత్రమే. హ్యాపీగా చచ్చిపోవడంలో ఎటువంటి లాభం లేదు. హ్యాపీగా బతకడంలోనే నిజమైన ఆనందం ఉంది. మనందరం ఆనందంగా ఉండడానికి అర్హులమే. కాబట్టి ప్రతికూల ఆలోచనలు ఏవైనా మీ మనసును చుట్టుముడుతున్నప్పుడు.. వాటికి కొద్దిగా బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అవ్వండి. ఆ నెగిటివ్ థాట్స్​తో మీరు సమయాన్ని వృథా చేస్తే.. మీకు మరో అవకాశం దొరుకుతుందా?

ఉన్నదే చిన్న లైఫ్.. ఆ టైమ్​లో మన డెత్ హాయ్​ చెప్పిందనుకో.. అయ్యో నేను ఇలా చేయలేకపోయేనే.. ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను. కొంచెం కూడా ఆనందంగా లేను అని చింతిస్తూ చనిపోవడం కన్నా.. కొన్ని మధురమైన జ్ఞాపకాలతో.. సంతోషంగా ఉంటే చాలు కదా. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేయండి. రూల్స్ అనేవి ఎదుటివాడిని కంట్రోల్ చేయడానికే పెట్టినవే తప్పా.. ఇంకేదో కాదు. మీకు చెడు కాదు అనిపించనంతవరకు రూల్స్ బ్రేక్ చేయొచ్చు. అది మీకు సంతోషాన్ని ఇస్తుందా? మళ్లీ మళ్లీ వాటిని ట్రై చేయొచ్చు. కానీ కొత్తగా ట్రై చేయండి. రోటీన్​గా చేస్తే బోర్​ కొట్టే అవకాశముంది. ఇవి మీకు మంచి జ్ఞాపకాలు ఇస్తాయి. అన్ని మధురంగా ఉండాలనే రూల్ లేదు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగలవచ్చు. కానీ అవికూడా మంచి జ్ఞాపకాలే కదా. ఎందుకంటే మీరు ట్రై చేశారు కాబట్టి.

జీవితంలో ప్రతి ఒక్కరినీ క్షమించడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని మీరు ఆస్వాదించే ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి. ఇది మీకు శాంతిని ఇస్తుంది. ఇది మీకు శాంతిని ఇస్తుంది. మీలోని పగను దూరం చేస్తుంది. ఓ మనిషి దృష్టిలో క్షమించరాని తప్పుచేశారని మీరు భావిస్తే.. వారిని క్షమించకపోయినా పర్లేదు కానీ.. వారు మీ లైఫ్​లో లేరనుకుని మూవ్ అయిపోండి. అంతేకానీ మనసులో ద్వేషాలు పెంచేసుకుని.. అది చేద్దాం ఇది చేద్దాం అనుకోవడం మీకే మంచిది కాదు.

అంతేకాదు బాగా నవ్వుకోండి. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఎక్కువ నవ్వుకోండి. మీకు నచ్చిన పని చేయండి. మీకు నవ్వు తెప్పించే పనులు చేయడంలో ఎప్పుడూ వెనకాడకండి. మీ చుట్టూ ఉన్నవారిని నవ్వించండి. వారితో కలిసిమెలిసి హాయిగా బతికేయండి. మీరు నవ్వుతూ ఉన్నప్పుడూ బాధకు మీ దగ్గర చోటు ఉండదు. ఒకవేళ బాధ ఉన్నా.. ఎక్కువసేపు మిమ్మల్ని బాధపడనివ్వదు. అలాగే ఎవరినైనా ముద్దుపెట్టుకునే ఛాన్స్ వచ్చినప్పుడు కంగారుగా పని కానివ్వకండి. ముద్దును ఫీల్​ అవ్వండి. ఆ క్షణాన్ని ఆస్వాదించండి. అంతేకానీ కంగారుగా చేసుకుని వెళ్లిపోతే కిక్​ ఏముంటుంది. మీ దగ్గర టైమ్​ లేదు అనుకున్నప్పుడు కూడా.. కిస్​ని ఫీల్​ అవుతూ చేస్తే.. మీకు గుర్తిండిపోతుంది. అంతేకానీ దానిని కూడా యాంత్రికంగా ఇవ్వడం ఏంటి మీరే ఆలోచించుకోండి.

ఏ విషయాలైనా.. ఎంతటి గొప్ప విషయాలైనా వాటి గురించి ఆలోచిస్తూ.. చింతిస్తూ కుర్చోకండి. జరిగేది జరగక మానదు. ఇది మీ జీవితాన్ని ఆనందించకుండా చేసేస్తుంది కాబట్టి.. కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేసి.. ముందుకు సాగడం నేర్చుకోండి. మీ లైఫ్​ని మీరు సంతోషంగా, పరిపూర్ణంగా జీవించడం నేర్చుకోండి. నచ్చిన విషయాలు చేయండి. బాధపెట్టేవాటికి దూరంగా ఉండండి. స్లోగా కిస్ చేయండి. ఇతరులను త్వరగా క్షమించండి. మనసులో కుళ్లు పెట్టుకోకండి. నవ్వుకోండి. నవ్వులు పంచండి.

టాపిక్