Vivo X Fold Plus Price- Specs । వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. మడత తెరిస్తే అద్భుతమైన ఫీచర్లు!
27 September 2022, 17:53 IST
- వివో కంపెనీ Vivo X Fold Plus పేరుతో సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ప్రత్యేకతలు చూడండి.
Vivo X Fold Plus
మొబైల్ తయారీదారు వివో, తాజాగా మరొక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo X Fold Plus పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఒరిజినల్ ఫోల్డ్‌కు సక్సెసర్‌గా వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో వివో కంపెనీ తమ మొట్టమొదటి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ Vivo X Fold మోడల్‌ను లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన ప్లస్ మోడల్ దాని పాత మోడల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఉంటుంది.
కొత్త Vivo X Fold Plus లో వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన ప్రాసెసర్‌తో పాటు సరికొత్త Android 12 OSలో బూట్‌లను అందిస్తుంది.
Vivo X Fold Plus ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మడత తెరిస్తే 8.03-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మూసినపుడు 6.53-అంగుళాల ఔటర్ స్క్రీన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు డిస్‌ప్లేలు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌లను కలిగి ఉన్నాయి.
ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్ తో కూడిన క్వాడ్ కెమెరా ఉంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ కాబట్టి, వెనుక కెమెరాను సెల్ఫీ కెమెరాగా కూడా ఉపయోగించవచ్చు. దీని కెమెరాతో 8K రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
Vivo X Fold+ ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్‌కామ్ Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ఇచ్చారు. ఇది బ్యాటరీ వినియోగాన్ని 30% వరకు తగ్గిస్తుంది, ఫోన్ పనితీరును 10% మెరుగుపరుస్తుంది. ర్యామ్, స్టోరేజ్ పరంగా ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్‌లో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి.
Vivo X Fold Plus స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 8.03-అంగుళాల LTPO AMOLED ఇన్నర్ డిస్‌ప్లే
- 6.53-అంగుళాల 120Hz AMOLED ఔటర్ స్క్రీన్
- కాన్ఫిగరేషన్స్: 12GB ర్యామ్/256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB RAM/512GB ఇంటర్నల్ స్టోరేజ్
- స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+ 48MP+12MP+2MP క్వాడ్-కెమెరా సెటప్
- ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 4730 mAh బ్యాటరీ సామర్థ్యం
- 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
Vivo X Fold Plus ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సన్నీ మౌంటైన్ బ్లూ, హుయాక్సియా రెడ్, సైకామోర్ యాష్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
చైనా మార్కెట్లో Vivo X ఫోల్డ్ ప్లస్ ఫోన్ ధరలను పరిశీలిస్తే.. 12GB + 256GB వేరియంట్‌కు CNY 9,999 (సుమారు రూ. 1,15,000)
12GB + 512GB వేరియంట్ కోసం ధర CNY 10,999 (సుమారు రూ. 1,25,000).
ఈ ఫోన్ సెప్టెంబర్ 29 నుండి చైనాలో విక్రయాలు ప్రారంభమవుతాయి, మిగతా మార్కెట్లలో ఎప్పుడు విడుదల అవుతుందనేది అస్పష్టంగా ఉంది.