Vivo X Fold- ఈ స్మార్ట్‌ఫోన్‌ను మడిచి జేబులో పెట్టేసుకోవచ్చు!-foldable smartphone vivo x fold launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Foldable Smartphone Vivo X Fold Launched

Vivo X Fold- ఈ స్మార్ట్‌ఫోన్‌ను మడిచి జేబులో పెట్టేసుకోవచ్చు!

Manda Vikas HT Telugu
Apr 12, 2022 02:53 PM IST

స్లైడ్ ఫోన్లు, ఫ్లిప్ ఫోన్లు, బండఫోన్లు పోయి ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ల కాలం వచ్చింది. ఒప్పో సిస్టర్ కంపెనీ వివో కూడా తాజాగా Vivo X ఫోల్డ్‌ పేరుతో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుత ఫీచర్లు దీని సొంతం. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Vivo X Fold
Vivo X Fold (Vivo)

ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికే మాత్రమే ఉపయోగించే ఒక పరికరం.. నేడు అదే ఫోన్ అరచేతిలో ఒక ప్రపంచం. ఈ స్మార్ట్ యుగంలో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వస్తుంది. కనెక్టివిటీ 4G నుంచి 5Gకి మారుతున్న వేళ సరికొత్త ఆవిష్కరణలు, ఆకర్షణీయమైన డిజైన్‌లు అబ్బురపరుస్తున్నాయి.

ప్రముఖ మొబైల్ తయారీదారు వివో తాజాగా Vivo X Fold పేరుతో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Samsung Galaxy Fold 3, Oppo Find N ఇంకా Huawei Mate X2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల సరసన ఇప్పుడు ఇప్పుడు Vivo X Fold కూడా చేరింది. ఇది వివో నుంచి వచ్చిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌.

ఈ సరికొత్త Vivo X Fold స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ సహాయంతో పనిచేస్తుంది. అలాగే AMOLED డిస్‌ప్లే, Zeiss-ఆధారిత కెమెరాలను కలిగి మంచి ప్రీమియం డిజైన్ బాడీలో ప్యాక్ లో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో పాటు మిగతా వివరాలు ఎలా ఉన్నాయో చూడండి.

Vivo X Fold స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.53-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. మడత తెరిస్తే  డిస్‌ప్లే సైజ్8.03- అంగుళాలకు పెరుగుతుంది.

కాన్ఫిగరేషన్స్: 12GB ర్యామ్/256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB RAM/512GB ఇంటర్నల్ స్టోరేజ్

స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 12MP జూమ్ సెన్సార్;  16MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4600 mAh బ్యాటరీ సామర్థ్యం, 66W ఫాస్ట్ ఛార్జర్

ఈ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X ఫోల్డ్‌ నలుపు, నీలం, బూడిద అనే మూడు కలర్ ఛాయిస్ లలో వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఏప్రిల్ 22 నుంచి చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తుందనే వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

చైనా మార్కెట్లో Vivo X ఫోల్డ్‌ 256GB స్టోరేజ్‌తో వేరియంట్ ధర CNY 8,999 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1,07,214). అలాగే 512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY 9,999 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1,19,100) ఉంది. అంటే ఇండియన్ మార్కెట్లో విడుదలయితే ఈ ఫోన్ ధరలు రూ. లక్షకు పైబడి ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్