తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitamin Khichdi Recipe । విటమిన్ ఖిచ్డీ.. పోషకభరితమైన, రుచికరమైన భోజనం!

Vitamin Khichdi Recipe । విటమిన్ ఖిచ్డీ.. పోషకభరితమైన, రుచికరమైన భోజనం!

HT Telugu Desk HT Telugu

07 July 2023, 13:43 IST

google News
    • Vitamin Khichdi Recipe: విటమిన్ ఖిచ్డీ లేదా దీనినే దాలియా కిచిడీ అని కూడా అంటారు. దీనిని తయారు చేయడం చాలా సులభం. రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. 
Vitamin Khichdi Recipe
Vitamin Khichdi Recipe (istock)

Vitamin Khichdi Recipe

Healthy Food Recipes: ఖిచ్డీ ఎంతో తేలికైన, ఆరోగ్యకరమైన ఆహారం. సాధారణంగా ఖిచ్డీని బియ్యం, పప్పులనుతో కలిపిచేసే ఒక వన్-పాట్ రెసిపీ. అయితేమీరు విటమిన్ ఖిచ్డీని ఎప్పుడైనా తిన్నారా? విటమిన్ ఖిచ్డీ అనేది బియ్యం ఉపయోగించకుండా గోధుమ నూకలను ఉపయోగించి చేసే వంటకం. ఇందులో పెసరి మొలకలు, వివిధ కూరగాయలను కలిపి రుచికరంగా వండుకోవచ్చు. అందుకే ఇది రెగ్యులర్ ఖిచ్డీ కంటే మరిన్ని పోషకాలు నిండి ఉంటుంది, కాబట్టి మరింత ఆరోగ్యకరమైనది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

విటమిన్ ఖిచ్డీ లేదా దీనినే దాలియా కిచిడీ అని కూడా అంటారు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఈ విటమిన్ ఖిచ్డీని మీరు ఉదయం అల్పాహారం, బ్రంచ్ లేదా లంచ్‌లో తినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. డిన్నర్‌లో కూడా చేర్చుకోవచ్చు. విటమిన్ ఖిచ్డీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, మీరూ ట్రై చేయండి.

Vitamin Khichdi Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు గోధుమ నూకలు
  • 1/4 కప్పు మొలకెత్తిన పెసర్లు
  • 1/4 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  • 1/2 కప్పు పచ్చి బఠానీలు
  • 1/4 కప్పు సన్నగా తరిగిన టమోటాలు
  • 2 టేబుల్ స్పూన్లు పెరుగు
  • 1/2 కప్పు కాటేజ్ చీజ్/ పనీర్ క్యూబ్స్
  • 2 టీస్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • 1 tsp పచ్చిమిర్చి పేస్ట్
  • 2 స్పూన్ నూనె
  • 2 లవంగాలు
  • 1 దాల్చిన చెక్క
  • 2 ఏలకులు
  • 1 బిరియానీ ఆకు
  • 1/2 టీస్పూన్ పసుపు పొడి
  • 2 స్పూన్ గరం మసాలా
  • 1 స్పూన్ నూనె
  • రుచికి తగినంత ఉప్పు
  • రుచికి తగినంత నల్ల మిరియాల పొడి

విటమిన్ ఖిచ్డీ తయారీ విధానం

  1. ముందుగా గోధుమ నూకలను నీటిలో బాగా కడగాలి, ఆపై నీటిని వడపోసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో నెయ్యి వేడి చేసి, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి మీడియం మంట మీద కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
  3. అనంతరం గోధుమ నూకలు, మొలకెత్తిన పెసర్లు వేసి 30 సెకన్ల పాటు మీడియం మంట మీద వేయించాలి.
  4. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిబఠానీలు, టొమాటోలు, పెరుగు, పసుపు పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి.
  5. 2 కప్పుల వేడినీరు పోసి మరోసారి బాగా కలపండి, మూతపెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ మీద ఉడికించాలి. పూర్తయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి.
  6. చివరగా ఒక చిన్న నాన్-స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి, పనీర్, ఉప్పు, మిరియాల పొడి వేసి మీడియం మంట మీద 30 సెకన్ల పాటు వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఖిచ్డీలో కలిపేయాలి.

అంతే, విటమిన్ ఖిచ్డీ రెడీ. పెరుగుతో వేడివేడిగా వడ్డించండి.

తదుపరి వ్యాసం