తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soya Khichdi Recipe । సోయా ఖిచ్డీ.. హాయిగా తినాలనిపించే ఆహారం!

Soya Khichdi Recipe । సోయా ఖిచ్డీ.. హాయిగా తినాలనిపించే ఆహారం!

HT Telugu Desk HT Telugu

29 April 2023, 19:32 IST

    • Soya Khichdi Recipe:  త్వరత్వరగా, పోషకాలు నిండిన రాత్రి భోజనం చేయాలనుకుంటే సోయా ఖిచ్డీ బెస్ట్. రెసిపీ ఇక్కడ ఉంది, ప్రయత్నించండి.
Soya Khichdi Recipe
Soya Khichdi Recipe (unsplash)

Soya Khichdi Recipe

Healthy Dinner Recipes: సోయాబీన్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. శాకాహార ప్రోటీన్ వనరులలో ఇవి కూడా ఒకటి. సోయాతో వండిన ఆహారాలు తినడం ద్వారా కండరాలు, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) సహా కొన్ని క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ఈ ఆహారం సహాయపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

రాత్రి భోజనంలో ఖిచ్డీ అత్యుత్తుమ ఆహారాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ మీకోసమ్ సోయాతో పాటు కొన్ని కూరగాయలను కలిపి వమ్డే సోయా ఖిచ్డీ రెసిపీని అందిస్తున్నాం. ఈ వంటకం ఎంతో రుచికరమైనది, పోషక విలువలు కలిగినది, త్వరగా వండుకోవచ్చు కూడా.

Soya Khichdi Recipe కోసం కావలసిన

  • 1 కప్పు నానబెట్టిన సోయా బీన్లు
  • 1.5 కప్పు నానబెట్టిన బియ్యం
  • 2 పచ్చిమిర్చి
  • 2 టమోటాలు
  • 1 పెద్ద ఉల్లిపాయ
  • 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 1 టీస్పూన్ జీరా
  • 2-3 tsp తాజా కొత్తిమీర ఆకులు
  • 1/2 కప్పు పెరుగు
  • 1/4 కప్పు పచ్చి బఠానీలు
  • ఉప్పు రుచికి తగినంత

సోయా ఖిచ్డీని ఎలా తయారు చేయాలి

  1. ముందుగా ఒక పాన్‌లో నీటిని మరిగించండి, అందులో నానబెట్టిన సోయా బీన్స్, బియ్యంతో పాటు టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించండి
  2. మరొక పాన్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేయించాలి.
  3. ఆ తర్వాత, తరిగిన ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాలి.
  4. అనంతరం ఇందులో వండిన సోయా అన్నంతో పాటు పసుపు, పెరుగు, పచ్చి బఠానీలు రుచికి తగినంత ఉప్పు వేసి కలపండి
  5. అవసరమైతే కొన్ని నీళ్లు పోసి కనీసం 10 నిమిషాలు ఉడికించండి, కలుపుతూ ఉండండి.
  6. చివరగా తరిగిన కొత్తిమీరను గార్నిష్ చేయండి.

అంతే, రుచికరమైన సోయా ఖిచ్డీ రెడీ.

తదుపరి వ్యాసం