Detox Khichdi for Liver । కాలేయంలో కొవ్వును కరిగించే డిటాక్స్ ఖిచ్డీ.. తింటే ఆరోగ్యం గ్యారెంటీ!
19 April 2023, 13:10 IST
- Detox Khichdi Recipe: చాలా రకాల ఆహారాలతో కాలేయం చెడిపోతుంది, అయితే కొన్ని ఆహారాలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాంటి ఆహారాలైన డిటాక్స్ ఖిచ్డీ, గ్రీన్ చట్నీ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి చూడండి.
Detox Khichdi Recipe
World Liver Day 2023: అతిగా మద్యం సేవించడం వలన కాలేయం పాడవుతుందని తెలుసు. ఇది ఆల్కాహాలిక్ కాలేయ వ్యాధికి దారితీస్తుంది. అయితే మద్యం సేవించని వారు కూడా కాలేయ సంబంధింత సమస్యలను ఎదుర్కొంటారు. ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 40% మంది భారతీయులు నాన్- ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని కలిగి ఉన్నారు, అయితే వారిలో చాలా మంది ప్రారంభ దశలో ఉన్నందున లక్షణాలు కనిపించడం లేదు. నిష్క్రియాత్మక జీవనశైలిని, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం, అవసరానికి మించి తినడం వలన ఫ్యాటీ లివర్ వ్యాధి (Fatty Liver) సంభవిస్తుంది. ఇది సిర్రోసిస్‌గా రూపాంతరం చెందితే, కాలేయం పూర్తిగా పనిచేయనట్లే. ఈ పరిస్థితి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా, పోషకాహార నిపుణురాలు ఖుష్బూ జైన్ కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందించే రెసిపీలను పంచుకున్నారు. ఆమె అందించిన డిటాక్స్ ఖిచ్డీ, గ్రీన్ చట్నీ రెసిపీలు ఈ కింద ఇవ్వడమైనది. ఈ వంటకం తినడం వలన కాలేయం శుభ్రపడటమే కాకుండా దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Detox Khichdi Recipe కోసం కావలసినవి
- బియ్యం - 1 గిన్నె
- పెసరిపప్పు- 2 గిన్నెలు
- తరిగిన ఆకుకూరలు (పాలకూర, ముల్లంగి, క్యారెట్ టాప్స్, బీట్ గ్రీన్స్, కాలీఫ్లవర్ గ్రీన్స్, మెంతులు, బచ్చలికూర, ఉసిరి ఆకులు) - 1 కప్పు
- తురిమిన కుకుర్బిట్ వెజిటబుల్స్ (సీసా పొట్లకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, బూడిద పొట్లకాయ, బేబీ పుచ్చకాయ, సొరకాయ, పాము పొట్లకాయ, బటర్‌నట్ స్క్వాష్) - 1 కప్పు
- వెల్లుల్లి - 2 రెబ్బలు
- అల్లం - 1-అంగుళం ముక్క
- లవంగం - 1
- మిరియాలు -2
- పసుపు - చిటికెడు
- నీరు - 1/2 కప్పు
- తురిమిన కొబ్బరి - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
- నెయ్యి - 11 టీస్పూన్లు
- ఉప్పు రుచికి తగినంత
డిటాక్స్ ఖిచ్డీ తయారీ విధానం
- ముందుగా బియ్యం, పెసరిపప్పును కలిపి 6-8 గంటలు నానబెట్టండి.
- అనంతరం ఒక బాణాలిలో నానబెట్టిన బియ్యం, పెసరిపప్పు మిశ్రమం వేయండి. అందులోనే కొబ్బరి, కొత్తిమీర, నెయ్యి మినహాయించి పైన పేర్కొన్న మిగతా పదార్థాలన్నీ వేసేయండి, కొన్ని నీళ్లు పోసి ఎక్కువ మంటపై ఉడికించండి.
- బాగా ఉడుకుతున్నప్పుడు మంటను తగ్గించి, మూతపెట్టి 20-25 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి, అప్పుడప్పుడు కలుపుతుండండి.
- అన్నం, పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత, మంటను ఆఫ్ చేసి, కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. ఆపైన నెయ్యి, తురిమిన కొబ్బరి, కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయండి.
అంతే, డిటాక్స్ ఖిచ్డీ రెడీ. దీనిని ప్రత్యేకమైన గ్రీన్ చట్నీతో తినండి. ఆ గ్రీన్ చట్నీ ఎలా చేయాలో కింద చూడండి.
గ్రీన్ చట్నీ తయారీ ఇలా..
3 టేబుల్ స్పూన్లు నువ్వులను రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర ఆకులు, కాండాలు, చేతి నిండా పుదీనా ఆకులు, చేతి నిండా కరివేపాకు, 2-3 కాండాలు సెలెరీ ఆకులు, 2-3 పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఒక అంగుళం అల్లం ముక్క, నిమ్మకాయ రసం, మామిడికాయ లేదా ఉసిరికాయ ముక్క, రుచికోసం నల్ల ఉప్పు అన్నీ తీసుకొని, ఒక మిక్సర్ జార్ లో వేసి, కొన్ని నీళ్లు పోసి చట్నీలాగా రుబ్బుకోవాలి. ఈ చట్నీ కాలేయానికి చాలా మంచిది. దీనిని గాలిచొరబడని కంటైనర్ లో ఉంచి 3-4 రోజులు నిల్వచేసుకోవచ్చు.