Millet Spinach Khichdi Recipe । పాలకూర మిల్లెట్ ఖిచ్డీ.. మాన్‌సూన్‌లో మనస్ఫూర్తిగా తినండి!
Millet Spinach Khichdi Recipe: వర్షాకాలంలో తినాల్సిన ఆహారాలలో ఖిచ్డీ తప్పకుండా ఉండాలి. మిల్లెట్ పాలకూర ఖిచ్డీని ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Healthy Monsoon Recipes: మాన్‌సూన్ వచ్చేసింది, సీజన్ మారిందంటే మనం తీసుకునే ఆహారాలలో కూడా మార్పు రావాలి. మాన్‌సూన్ కు అనుగుణమైన ఆహారాలను తీసుకోవాలి. అయినప్పటికీ ఈ వర్షాకాలంలో ఒకవైపు చల్లగా వర్షం కురుస్తుండగా ఆ వర్షాన్ని చూస్తూ వేడివేడిగా పకోడిలను, సమోసాలను తినాలనిపిస్తుంది. కానీ ఏదైనా పరిమితిలోనే ఉండాలి, ఎక్కువగా ఇలా నూనెలో వేయించినవి తింటే మీ ఆరోగ్యం కూడా వర్షార్పనం అవుతుంది. బదులుగా మీరు రుచికరమైన సూప్‌లు, హెర్బల్ పానీయాలు, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.
వర్షాకాలంలో తినాల్సిన ఆహారాలలో ఖిచ్డీ తప్పకుండా ఉండాలి. ఖిచ్డీ చాలా తేలికైన ఆహారం, ఆరోగ్యకరమైనది. మంచి పోషకాలను మీకు అందిస్తుంది. దానిని మిల్లెట్లతో వండుకుంటే మరిన్ని మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇక్కడ మీకు రుచికరమైన మిల్లెట్ పాలకూర ఖిచ్డీ రెసిపీని అందిస్తున్నాము. ఇది మీకు మాన్‌సూన్ లో మంచి ఆహారం అవుతుంది. ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంగా, డిన్నర్ సమయంలోనూ తినడానికి అనుకూలమైనది. మిల్లెట్ పాలకూర ఖిచ్డీని ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Millet Spinach Khichdi Recipe కోసం కావలసినవి
- 1 కప్పు వరిగలు (proso millet)
- ¼ కప్పు పెసరిపప్పు
- 1¼ కప్పులు తరిగిన పాలకూర
- ¼ టీస్పూన్ పసుపు పొడి
- 1 స్పూన్ జీలకర్ర
- 1 అంగుళం అల్లం
- 1½ టేబుల్ స్పూన్లు తరిగిన వెల్లుల్లి
- 1 పెద్ద ఉల్లిపాయ
- 1-2 పచ్చిమిర్చి
- ¼ స్పూన్ గరం మసాలా పొడి
- ½ స్పూన్ నిమ్మరసం
- రుచికి తగినంత ఉప్పు
- నెయ్యి తగినంత
పాలకూర మిల్లెట్ ఖిచ్డీ తయారీ విధానం
- ముందుగా మిల్లెట్లను, పెసరిపప్పును ఒక గంట పాటు నీటిలో నానబెట్టండి.
- ఆ తర్వాత కుక్కర్‌లో నాననెట్టిన మిల్లెట్‌ను, పెసరిపప్పును వేయండి. అందులోనే పసుపు పొడి, ఉప్పు, 1 టీస్పూన్ నెయ్యి వేసి, 4 కప్పుల నీరు పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పూర్తయ్యాక చల్లారనివ్వండి.
- ఇప్పుడు మరొక పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి వేడి చేసి ఒక నిమిషం ఉడికించాలి.
- ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పాలకూర ఆకులు వేసి, గరం మసాల చేసి కాసేపు వేయించాలి.
- చివరగా ఉడికించిన మిల్లెట్- పెసరిపప్పు మిశ్రమాన్ని వేసి, కొద్దిగా నిమ్మరసం పిండి ప్రతిదీ బాగా కలపాలి.
అంతే, పాలకూర మిల్లెట్ ఖిచ్డీ రెడీ. కొద్దిగా నెయ్యి , పాపడ్‌లు , ఊరగాయతో సర్వ్ చేయండి.
సంబంధిత కథనం