తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iphone 15 Pro : రాబోయే Apple Iphone 15 Pro, Mac చిప్ వివరాలు ఇవే

iPhone 15 Pro : రాబోయే Apple iPhone 15 Pro, Mac చిప్ వివరాలు ఇవే

15 September 2022, 8:36 IST

google News
    • Apple iPhone 15 Pro : Apple iPhone 15 Pro Max అనేది Apple నుంచి రాబోయే మొబైల్. ఇది సెప్టెంబర్ 30, 2023న భారతదేశంలో ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు. మొబైల్ తగిన స్పెసిఫికేషన్లతో వస్తుందని.. దీని ధర రూ. 1,03,110 ప్రారంభ ధరతో లభ్యమవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. 
iPhone 15 Pro
iPhone 15 Pro

iPhone 15 Pro

Apple iPhone 15 Pro : ఆపిల్ తన iPhone 15 Pro లైనప్‌ను కొత్త బయోనిక్ A17 చిప్‌సెట్‌తో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ చిప్‌సెట్ తైవాన్ సెమీకండక్టర్ మేకర్ తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TMSC) ద్వారా 3nm ఆర్కిటెక్చర్‌పై నిర్మించనున్నారు. 3nm చిప్‌సెట్ M3 చిప్‌సెట్‌లో కూడా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది వచ్చే ఏడాది Mac లైనప్‌లో ఉపయోగిస్తున్నారు.

Apple Macs కోసం తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TMSC) మెరుగుపరిచిన 3nm ప్రాసెస్ ఆధారిత M3 చిప్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్న iPhone 15 Pro మోడల్‌ల కోసం A17 బయోనిక్ చిప్‌ను ఉపయోగిస్తుందని నివేదికలో తెలిసింది. Apple Insider నివేదిక ప్రకారం.. Nikkei Asia N3 అని పిలిచే TSMC మొదటి తరం 3nm ప్రక్రియతో పోలిస్తే N3E, TMSC మెరుగుపరిచిన 3nm ప్రక్రియ, మెరుగైన పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందజేస్తుందని పేర్కొంది.

నివేదిక ప్రకారం… నివేదిక ఏ ఐప్యాడ్ మోడల్‌లను సూచిస్తుందో అస్పష్టంగా ఉంది. ఆపిల్ వచ్చే నెలలో ఐప్యాడ్ ప్రోని M2 చిప్‌తో అప్‌డేట్ చేస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది TSMC రెండవ తరం 5nm ప్రక్రియ ఆధారంగా తయారు చేశారు. పాత A14 చిప్‌తో కూడిన కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ కూడా ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

గత వారం టెక్ దిగ్గజం TSMC 4nm ప్రాసెస్ ఆధారంగా A16 చిప్‌తో iPhone 14 ప్రో మోడల్‌లను ఆవిష్కరించింది. అయితే ప్రామాణిక iPhone 14, iPhone 14 Plus మోడల్‌లు మునుపటి తరం A15 చిప్‌తో అమర్చారు.

తదుపరి వ్యాసం