Tata iPhone manufacturing : ఐఫోన్ తయారీకి 'టాటా' సిద్ధం- ఆ సంస్థతో డీల్ ఫిక్స్!
09 September 2022, 12:07 IST
- Tata iPhone manufacturing : ఇండియాలో ఐఫోన్ తయారీకి టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ తైవాన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఐఫోన్ తయారీకి 'టాటా' సిద్ధం- ఆ సంస్థతో డీల్ ఫిక్స్
Tata iPhone manufacturing : ఇండియాలోని ఐఫోన్ ప్రియలకు గుడ్ న్యూస్! ఐఫోన్‌కి సంబంధించి.. దేశంలో ఒక ఎలక్ట్రానిక్ మేన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో టాటా గ్రూప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం యాపిల్‌కు సప్లయర్‌గా తైవాన్ కంపెనీతో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. దేశంలో ఐఫోన్ ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు!
తైవాన్‌కు చెందిన విస్ట్రన్ కార్ప్ అనే సంస్థ.. యాపిల్ కంపెనీకి సప్లయర్‌గా ఉంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్, సప్లై చెయిన్, అసెంబ్లీ వంటి విషయాలపై విస్ట్రన్ కార్ప్ నుంచి కావాల్సిన నైపుణ్యం పొందేందుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
డీల్ ఓకే అయితే.. ఇండియాలో ఐఫోన్‌ను తయారు చేసే తొలి సంస్థగా టాటా నిలుస్తుంది. ప్రస్తుతం.. ఐఫోన్ అసెంబ్లీ వంటివి అన్ని తైవాన్‌లోని విస్ట్రన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ తదితర సంస్థలు చూసుకుంటున్నాయి.
iPhone makers India : అంతేకాకుండా.. ఐఫోన్‌ని ఇండియా తయారు చేస్తే.. చైనాకు మరింత పోటీనిచ్చినట్టు అవుతుంది. ఎలక్ట్రిక్ పరికరాల తయారీలో చైనాకు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోతుంది. కొవిడ్, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు అవకాశాలు తగ్గిపోవాలని అమెరికా కూడా కోరుకుంటోంది. ఇక ఐఫోన్ తయారీ విషయంలో టాటా సక్సెస్ అయితే.. ఇతర దిగ్గజ కంపెనీలు కూడా ఇండియాకు వలస వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
విస్ట్రన్ ఇండియాలో టాటా వాటా కొనొచ్చు లేదా టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఇండియాలో ఆ సంస్థ ఓ ప్లాంటును ఏర్పాటు చేయవచ్చు.
ఈ వ్యవహారంపై యాపిల్‌కు సమాచారం ఉందా? లేదా? అన్నది తెలియరాలేదు. అయితే.. ఇతర దేశాల్లో ఉత్పత్తులపై యాపిల్ కూడా దృష్టిపెట్టింది. చైనాపై ఎక్కువ ఆధారపడటం ఆ సంస్థకు కూడా నచ్చడం లేదు.
Apple iPhone : స్థానిక సంస్థలతో కలిసి మేన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడుతూ ఉంటుంది యాపిల్. అయితే.. ఐఫోన్ అసెంబ్లీ వ్యవహారం కాస్త కఠినమైనది. అమెరికా నిబంధనలు, క్వాలిటీ కంట్రోల్‌కు తగ్గట్టు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యవహారంపై అటు టాటా గ్రూప్ నుంచి ఇటు విస్ట్రన్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.