Apple security flaw : యాపిల్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్, ఐప్యాడ్‌కు 'హ్యాకింగ్' దెబ్బ!
Apple security flaw : మీరు ఐఫోన్, ఐప్యాడ్ వినియోగిస్తున్నారు? అయితే మీ ప్రాడక్టులు హ్యాకింగ్‌కు గురయ్యే ముప్పు ఉంది. ఈ విషయాన్ని యాపిల్ సంస్థ స్వయంగా ప్రకటించింది.
Apple security flaw : యాపిల్ వినియోగదారులకు షాక్! ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని యాపిల్ సంస్థ స్వయంగా వెల్లడించింది.
ఆపరేటింగ్ సిస్టమ్‌లో భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్టు, ఈ సమస్య వల్ల యాపిల్ ప్రాడక్టులు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్టు సంస్థ పేర్కొంది. ఇప్పటికే.. పలు ప్రాడక్టులు హ్యాక్ అయినట్టు అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. హ్యాకింగ్ ముప్పు నుంచి బయటపడేందుకు.. యూజర్లు తొందరగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
కాగా.. ఆపరేటింగ్ సిస్టమ్‌లో లోపాల కారణంగా ఇప్పటివరకు యూజర్ల డేటాకు ఎంత నష్టం జరిగింది? అన్న విషయంపై యాపిల్ సంస్థ పూర్తి వివరాలు ఇవ్వలేదు.
ఈ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు..!
ఐఫోన్ 6ఎస్ మోడల్, ఐప్యాడ్ 5 జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ మిని 4, ప్యాడ్ ప్రో, 7 జనరేషన్ ఐపాడ్ టచ్‌తో పాటు మరిన్ని డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు ఉందని యాపిల్ వెల్లడించింది. హ్యాకర్లు.. ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో.. డివైజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ముప్పు ఉందని యాపిల్ పేర్కొంది.
మ్యాక్ కంప్యూటర్స్, యాపిల్ సఫారి బ్రౌజర్‌కి కూడా హ్యాకింగ్ ముప్పు పొంచి ఉంది.
అందువల్ల.. డివైజ్‌ల సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని సైబర్‌సెక్యూరిటీ నిపుణులు సైతం యాపిల్ యూజర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
సంబంధిత కథనం