తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : నమ్మకం ప్రాణంలాంటిది.. ఒక్కసారి పోతే తిరిగిరాదు

Tuesday Motivation : నమ్మకం ప్రాణంలాంటిది.. ఒక్కసారి పోతే తిరిగిరాదు

Anand Sai HT Telugu

18 April 2023, 4:30 IST

    • Tuesday Motivation : మనం ప్రేమించే వారు మనల్ని మోసం చేసినప్పుడు మనం అనుభవించే బాధను.. ఎలాంటి పదాలు కూడా వర్ణించలేకపోవచ్చు. అయితే మీకు ఇష్టమైన వ్యక్తి.. మోసాన్ని మరిచిపోయి.. క్షమించమని అడిగినప్పుడు మాత్రం.. క్షమించేయండి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యులు.. మనకు దగ్గరగా ఉన్నవారు ఇలా ఎవరైనా.. ఒకసారి మోసం చేసినా, ద్రోహం చేసినా వారిని మళ్లీ విశ్వసించడం చాలా కష్టం. అలా అని మనం ఎక్కువగా ప్రేమించే వారి నుండి దూరంగా ఉండలేం. కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి తప్పును అంగీకరిస్తే, మీరు క్షమించకుండా ఉండలేరు.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

ఏదైనా సంబంధంలో ద్రోహం చేసిన వ్యక్తి నమ్మకాన్ని పునర్నిర్మించడంలో మొదటి అడుగు వేయాలి. తప్పు చేశానని గుర్తించడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మిమ్మల్ని తిరస్కరించినప్పటికీ, ఎటువంటి సాకులు చెప్పకుండా.. ఎవరినీ నిందించకుండా, మీరు నమ్మకాన్ని తిరిగి పొందాలి. మీ తప్పులకు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండాలి.

నిజాయితీగల క్షమాపణ చెబితే.. ద్రోహం వల్ల కలిగే బాధను నయం చేయడంలో సహాయపడుతుంది. కానీ మీ క్షమాపణలో నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. అలాగే మోసం వల్ల కలిగే బాధను అర్థం చేసుకునే వైఖరి మీకు ఉండాలి. బంధంలోని భావాలకు విలువ ఇవ్వండి. వారిపై కరుణ చూపండి. వీటన్నింటితో పాటు గతంలో జరిగిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

మీరు చేసిన ద్రోహాన్ని బట్టి, సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని సరిచేయడానికి చూడండి. వైవాహిక జీవితం విషయానికి వస్తే, మీరు మూడో వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే, వెంటనే ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండండి. అలాంటి వాటిలో విషయాలను సరిదిద్దడానికి చాలా ప్రయత్నం అవసరం.

మీ ఆలోచనలు, భావాలు, చర్యలను దాచుకోవద్దు. మీ జీవితంలోని అన్ని విషయాలను ఎలాంటి దాపరికం లేకుండా పంచుకోవడం, ఇష్టపూర్వకంగా సమాచారం ఇవ్వడం, నిజాయితీగా ఉండటం ముఖ్యం. ఇది బహిరంగ సంభాషణకు దారితీస్తుంది. ఇది మీ భాగస్వామి మిమ్మల్ని మళ్లీ విశ్వసించగలదనే ఆశను కూడా ఇస్తుంది.

మీ భావాలపై మీరు స్థిరంగా ఉండాలి. ఇది కాలక్రమేణా సంబంధంలో నమ్మకాన్ని పెంపొందించడానికి దారితీస్తుంది. వాగ్దానాలను నిలబెట్టుకోవడం, సమయపాలన, కట్టుబాట్లకు కట్టుబడి ఉండటం ముఖ్యం. మీరు మీ భాగస్వామిపై ఆధారపడి ఉన్నారని, సంబంధాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నారని క్లారిటీ ఇవ్వాలి.

మనస్సు నుండి ఒకసారి వెళ్లిన నమ్మకం.. పునర్నిర్మించడం సులభం కాదు. ఇది ఒక రోజు పని కాదు. ఓపికపట్టడం చాలా ముఖ్యం. నమ్మకాన్ని పూర్తిగా పునరుద్ధరించడానికి ముందు వారి భావాలను అర్థం చేసుకోవాలి. మీ విశ్వసనీయతను నిరంతరం నిరూపించుకోవడం ముఖ్యం. వారికి భావోద్వేగ మద్దతును చూపడం వలన వారు మీపై నమ్మకాన్ని పెంచుకోవచ్చు.

నిన్ను ప్రేమించే వారిని ఎనాటికీ ద్వేషించకు..

నిన్ను నమ్మినవారిని ఎప్పటికీ మోసం చేయకు..

మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే..

మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది..