Makhana Kaju Kheer Recipe : జీడిపప్పు.. మఖానా ఖీర్.. దీపావళి స్పెషల్ రెసిపీ..
21 October 2022, 7:13 IST
- Makhana Kaju Kheer Recipe : ఈ మధ్య కాలంలో మఖానాను చాలామంది తమ డైట్లో భాగం చేసుకుంటున్నారు. ఇది హెల్త్‌కి చాలా మంచిదని చెప్తున్నారు. మొదట్లో ఇది నార్త్ వాళ్లు మాత్రమే ఎక్కువ చేసుకునేవాళ్లు. అయితే దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటున్నారు. దీనిని స్వీట్‌గా కూడా తీసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా?
మఖానా కాజు ఖీర్
Makhane Kaju Kheer Recipe : పండుగ సమయాల్లో మీరు తయారు చేసే స్వీట్స్ హెల్తీగా కూడా ఉండాలంటే.. మఖానాతో చేసే ఓ అద్భుతమైన రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు, మఖానేతో తయారు చేసే.. ఖీర్.. మీ పండుగను అద్భుతంగా మార్చేస్తుంది. మరి ఈ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* మఖానా - 1 కప్
* జీడిపప్పు - 1 కప్
* పాలు - అర లీటర్
* నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్
* ఖోయా - 3 టేబుల్ స్పూన్లు
* చక్కెర - అరకప్పు (గ్రైండ్ చేయండి)
* ఏలకుల పొడి - పావు టీస్పూన్
* బాదం - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)
* పిస్తా - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. దానిని స్టౌవ్ మీద పెట్టి.. నెయ్యి వేసి వేడి చేయండి. మరో పాన్‌లో పాలు మరిగించండి. మొదటి పాన్‌లో నెయ్యి వేడి అవ్వగానే.. మఖానా, జీడిపప్పును వేసి ఫ్రై చేయండి. పాలల్లో ఖోయా, చక్కెర వేసి తక్కువ వేడి మీద మరిగించాలి. అనంతరం మఖానా, కాజు వేసి కలపాలి. లేదంటే జీడిపప్పును గ్రైండ్ చేసి ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రంలో యాలకుల పొడి, బాదం, పిస్తా వేసి బాగా కలపాలి. అంతే ఖీర్ రెడీ. దీనిని స్టౌవ్ మీద నుంచి దించేసి.. గది ఉష్ణోగ్రతకు, రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుని.. చల్లగా మారిన తర్వాత తినవచ్చు.