తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Toothaches : పంటినొప్పా? తక్షణ ఉపశమనం కావాలంటే వీటిని ఫాలో అవ్వండి..

Home Remedies for Toothaches : పంటినొప్పా? తక్షణ ఉపశమనం కావాలంటే వీటిని ఫాలో అవ్వండి..

16 December 2022, 11:50 IST

google News
    • Home Remedies for Toothaches : చలికాలంలో దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చల్లని నీళ్లు తాగినా, వెచ్చగా ఏమైనా తీసుకున్నా పళ్లు జివ్వుమంటాయి. పంటి నొప్పి వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. ఆ సమయంలో సరిగ్గా తినలేము.. తాగలేము. అయితే కొన్ని ఇంటి నివారణులతో తక్షణ ఉపశమనం పొందవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాల సమస్యలు
దంతాల సమస్యలు

దంతాల సమస్యలు

Home Remedies for Toothaches : మీ దంతాల లోపలి పొర కందిపోయినప్పుడు.. పిప్పళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు పంటి నొప్పి వస్తుంది. అయితే ఇది మీ దవడలు, దంతాల చుట్టూ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పంటి నొప్పులనేవి చిగుళ్లు, పగుళ్లు, కావిటీస్ ఫలితంగా వస్తాయి. అయితే ఈ నొప్పి ఒక్కసారి వస్తే.. ఏ పని చేయలేము. తలనొప్పి, చెవి నొప్పి కూడా వచ్చేస్తుంది. ఒక్కోసారి ట్యాబ్లెట్స్ తీసుకున్నా.. ఫలితాలు అంత మెరుగ్గా ఉండవు.

అయితే దంతాల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మందులు అందుబాటులో లేనప్పుడు.. కొన్ని సహజమైన ఇంటినివారణలు పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి అంటున్నారు. వీటి ద్వారా తక్షణమే రిలీఫ్ వస్తుందన్నారు. మరి ఆ ఇంటి నివారణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పునీరు..

పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఉప్పునీరు ఒకటి. ఉప్పునీటితో శుభ్రం చేయడం వల్ల మీకు నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. నోటి గాయాలను నయం చేయడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

సహజ క్రిమిసంహారిణిగా ఉప్పునీరు పని చేస్తుంది. ఇది మీ దంతాల మధ్య చిక్కుకున్న ఆహారాలను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపి.. మౌత్ వాష్​గా ఉపయోగించండి.

పిప్పరమింట్ టీ బ్యాగ్స్

యాంటీ బాక్టీరియల్, తేలికపాటి తిమ్మిరి లక్షణాలతో నిండిన పిప్పరమెంటు టీ బ్యాగ్‌లు మీకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. నోటి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సున్నితమైన చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.

పుదీనా పంటి నొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. మీరు పిప్పరమెంటు టీ బ్యాగ్‌లను ప్రభావిత ప్రాంతంపై ఉంచండి. తక్షణ ఉపశమనం పొందడానికి మీరు దీన్ని వేడిగా అప్లై చేసుకోవచ్చు.

వెల్లుల్లి

ఔషధ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన వెల్లుల్లి, దంతాలపై ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. పంటి నొప్పులను తగ్గిస్తుంది. ఇది నోటి దుర్వాసనను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మీరు తాజా వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు కొద్దిగా ఉప్పుతో పాటు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి.. ఆ పేస్ట్‌ను తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు.

లవంగాలు

శతాబ్దాలుగా దంత నొప్పికి చికిత్స చేయడంలో లవంగాలలో యూజెనాల్ అనే సహజ క్రిమినాశక ఉంటుంది. ఇది పంటి నొప్పి, సున్నితత్వాన్ని మొద్దుబారడానికి.. నోటి గాయాలను క్రిమిరహితం చేయడానికి, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

లవంగం నూనె, జోజోబా నూనెను కలపండి. దానిని కాటన్ బాల్​తో అప్లై చేయండి. నొప్పి, మంటను తగ్గించుకోవడానికి రోజుకు కొన్ని సార్లు అంటించండి.

థైమ్

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న థైమ్.. దంత క్షయాన్ని కలిగించే, పంటి నొప్పులను నయం చేసే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడుతుంది.

ఇది చిగురువాపు, సాధారణ నోటి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. థైమ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను కొంత క్యారియర్ ఆయిల్‌తో కరిగించి.. ప్రభావిత ప్రాంతానికి అప్లై చేయండి. మీరు ఒక గ్లాసు నీటిలో ఈ నూనెను తీసుకుని మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం