Mouthwash | మిరియాలు, లవంగాలతో ఇంట్లోనే సహజంగా మౌత్‌వాష్‌ను ఇలా తయారు చేసుకోండి!
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల మౌత్ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి తయారీలో ఎక్కువగా సింథటిక్ పదార్థాలనే వినియోగిస్తారు. చాలా వరకు ఆల్కాహాల్ ఆధారితమైన మౌత్‌వాష్‌లే ఉంటున్నాయి. దీర్ఘకాలంగా ఇలాంటి మౌత్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల జరిగే మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయి.
నోరు, దంతాలు, చిగుళ్లను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగం. దీర్ఘకాలం పాటు నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే అది మన ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. దంతాలు పాడైపోవడం, చిగుళ్లలో వాపు రావడంతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, చిత్తవైకల్యం, కీళ్లనొప్పులు లాంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తాయి. నోటి శుభ్రత కొన్నిసార్లు గర్భధారణ సమస్యలకు కూడా దారితీయవచ్చునని చెప్తారు.
ప్రతిరోజూ దంతాలను మూలమూలలా సరైన రీతిలో బ్రష్ చేసుకోవాలి. అయితే పంటి సున్నితత్వం, చిగుళ్లలో వాపు, ఇతర నోటి సమస్యలు ఉన్నవారికి బ్రష్ చేయడానికి బదులుగా మౌత్ వాష్ ఉపయోగించాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. కరోనా నేపథ్యంలో ఇటీవల కాలంగా చాలా మంది నోటి పరిశుభ్రత కోసం తరచూ మౌత్ వాష్ ఉపయోగించడం చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల మౌత్ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి తయారీలో ఎక్కువగా సింథటిక్ పదార్థాలనే వినియోగిస్తారు. చాలావరకు ఆల్కాహాల్ ఆధారితమైన మౌత్‌వాష్‌లే ఉంటున్నాయి. దీర్ఘకాలంగా ఇలాంటి మౌత్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల జరిగే మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవి నోటి లోపల లాలాజల ఉత్పత్తిని తగ్గించి నోరు పొడిబారేలా చేస్తాయి. అలాగే మౌత్‌వాష్‌ల తయారీలో ఉపయోగించే కొన్ని రకాల సింథటిక్ పదార్థాలు తల, మెడ క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తున్నాయి తాజా అధ్యయనాలు వెల్లడించాయి.
కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ పక్కనబెట్టి మనం ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మనకు మనంగా మౌత్‌వాష్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది 100 శాతం సహజమైనదే కాకుండా వివిధ రకాల వైరస్, బాక్టీరియాలతోనూ సమర్థవంతంగా పోరాడుతుంది.
మౌత్‌వాష్ తయారు చేయడమనేది ఏమంత భారీ ప్రక్రియ కూడా కాదు. చాలా చాలా సింపుల్! మౌత్‌వాష్ తయారీకి అవసరమయ్యే పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇక్కడ చూడండి.
స్పైసీ మౌత్‌వాష్ తయారీకి కావలసిన పదార్థాలు:
లవంగాలు: 4-5
నల్ల మిరియాలు: 4-5
స్వేదన జలం (డిస్టిల్డ్ వాటర్): 2 కప్పులు
తయారీ విధానం:
ఒక పాన్‌లో డిస్టిల్డ్ వాటర్ తీసుకొని అందులో నల్ల మిరియాలు, లవంగాలు వేసి కొద్దిసేపు మరగబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని పక్కనబెట్టి ఒక 5-6 నిమిషాల పాటు దానంతటదే చల్లబడనివ్వండి. అంతే మౌత్‌వాష్ ఫార్ములా ఇదే. దీనిని మీరు నిరభ్యంతరంగా మౌత్‌వాష్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇలా సహజమైన ఆల్కహాల్ రహిత మౌత్ వాష్ తో నోటిని శుభ్రం చేసుకుంటే బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది, వైరస్ లతో పోరాడుతుంది. దంతాలు, నోటి సున్నితత్వాన్ని కూడా కాపాడుతుంది. ఇంట్లో తయారు చేసిన సహజసిద్ధమైన మౌత్‌వాష్‌లు నోరు పొడిబారడం లేదా జిరోస్టోమియాకు కారణం కాదు.
లెమన్ ఫ్లేవర్ మౌత్‌వాష్ తయారీకి కావలసిన పదార్థాలు
1 గ్లాసు వెచ్చని నీరు
1 నిమ్మకాయ
తయారీ విధానం:
నిమ్మకాయను తీసుకుని, దాని రసాన్ని 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి. ఈ నీటితో మీ నోటిని పుకిలించి ఆపై ఉమ్మివేయండి.
నిమ్మకాయ సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది దంతాలపై పేరుకుపోయిన మురికిని తొలగించి క్రిములను నాశనం చేస్తుంది.
వగరుగా ఉండే మౌత్‌వాష్ - కావాల్సిన పదార్థాలు
2 స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్
1 కప్పు ఉప్పు
వెనీలా ఎసెన్షియల్ ఆయిల్ 1-2 చుక్కలు
తయారీ విధానం - పైన పేర్కొన్నవన్నీ బాగా కలిపి మౌత్‌వాష్ లాగా ఉపయోగించడమే. యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలను తెల్లగా మెరిసేటట్లు చేయడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. కాబట్టి ఈ మౌత్ వాష్ ఉపయోగించడం ద్వారా నోటి సమస్యలు దూరమవుతాయి. దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్